బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హుజూరాబాద్ డిపో సెక్రటరీగా ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీ ఠాగూర్ శివ దయాల్ సింగ్ ఎన్నికయ్యారు. కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన దిశగా ఆయన ఎన్నిక కావడంపై స్థానిక వాకర్స్ సభ్యులు, కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో శివ దయాల్ సింగ్ ఎల్లప్పుడూ ముందుంటారని, గతంలో ఉద్యమ సమయంలో ఆయన పోరాట పటిమను చాటారని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, డిపో సమర్థవంతమైన నిర్వహణకు ఆయన విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, సాదుల రవీందర్ బాబు, ఎడ్ల విజయ్ కుమార్, పడకమల్ల శేఖర్, ఎంపీటీ సతీష్ తదితరులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.











