ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

bahubalamtv Reporter
bahubalamtv.in

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

బాహు బలంన్యూస్ పరకాల,అక్టోబర్,09 .
కుల, మతాలతో సంబంధం లేకుండా ఆర్థిక ప్రాతిపదికన అన్ని వర్గాల్లోని పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించడమే ధ్యేయంగా పోరాడుతున్నామని ఓసీ జేఏసీ, ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ గార్డెన్‌లో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల ఓసీ ఐకాస ప్రతినిధులు, బహుజన కుల సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, సాధన కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అప్పమ్మగారి రాంరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
పేదరికమే ప్రాతిపదిక కావాలి
తాము ఏ సామాజిక వర్గానికీ, మతానికీ వ్యతిరేకం కాదని నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో క్రీమీలేయర్ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడంతో ప్రయోజనాలు పొందిన కుటుంబాలకే మళ్లీ మళ్లీ దక్కుతున్నాయని, అర్హులైన నిజమైన పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ (EWS) కల్పించిన తరహాలోనే, అన్ని వర్గాల్లోని నిరుపేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు వర్తింపజేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం జరపాలని, అవసరమైతే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉద్యమ గోడప్రతులను ఆవిష్కరించారు.
ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ యాత్ర ఈనెల 24న తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ప్రవేశించి, 26న జనగామ, హనుమకొండ మీదుగా సాయంత్రం 4 గంటలకు పరకాలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 26న సాయంత్రం 5 గంటలకు పరకాలలో పార్టీలకతీతంగా వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కొలగూరి రాజేశ్వర్‌రావుకు ఘన సన్మానం
ఇటీవల దేవాలయ కమిటీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ జిల్లా ఓసీ జేఏసీ అధ్యక్షుడు కొలగూరి రాజేశ్వర్‌రావును రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో ఓసీ ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పైళ్ల హరినాథ్ రెడ్డి, రెడ్డి జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఐలినేని మల్లికార్జున రెడ్డి, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, రాష్ట్ర నాయకుడు బొక్క శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ బార్ అసోసియేషన్ జేఏసీ నాయకుడు జలంధర్ రెడ్డి, కరీంనగర్ బార్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు పి.వి. రాజకుమార్, నాయీబ్రాహ్మణ సంఘాల ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు జంపాల నర్సయ్య, భిక్షపతి, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు బచ్చు ఆనందం, నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి, నడిపెల్లి లింగారావు, నాయినేని రవీందర్‌రావు, దూదిపాల తిరుపతి రెడ్డి, రూప్‌రెడ్డి తిరుపతి రెడ్డి, వెంకట శ్రవణ్ కుమారాచార్య, ఐతే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !