ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేసిన మహానేత సర్దార్ పటేల్. చందుపట్ల జనార్ధన్ . హుజురాబాద్ పట్టణ గ్రంథాలయంలో ఘనంగా పటేల్ 151వ జయంతి వేడుకలు..

bahubalamtv Reporter
bahubalamtv.in

ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేసిన మహానేత సర్దార్ పటేల్. చందుపట్ల జనార్ధన్ . హుజురాబాద్ పట్టణ గ్రంథాలయంలో ఘనంగా పటేల్ 151వ జయంతి వేడుకలు..

​బాహుబలం న్యూస్, హుజురాబాద్:
చిన్నాభిన్నంగా ఉన్న వందలాది సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి, భారత యూనియన్‌ను పటిష్ఠంగా నిర్మించిన యుగపురుషుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ కొనియాడారు. హుజురాబాద్ పట్టణ గ్రంథాలయంలో గ్రంథాలయ కృషీవలుడు తిరునగరి రమేష్, గ్రంథాలయ అధికారిణి విప్ప పద్మల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ పటేల్ 151వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా చందుపట్ల జనార్ధన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఉన్న 560కి పైగా సంస్థానాలతో పాటు హైదరాబాద్‌ను సైతం తన అచంచలమైన సంకల్పంతో భారత్‌లో విలీనం చేసిన చారిత్రక ఘనత తొలి హోం మంత్రి పటేల్‌దేనని ఉద్ఘాటించారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలను ధారబోసిన పటేల్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత 'భారతరత్న' పురస్కారం ప్రదానం చేయడంతో పాటు, గుజరాత్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించి, ఆయన జన్మదినాన్ని 'జాతీయ ఐక్యతా దినం'గా ప్రకటించడం యావత్ భారతావని గర్వించదగ్గ విషయమన్నారు. పటేల్ ప్రదర్శించిన నిరుపమాన దేశభక్తిని, త్యాగగుణాన్ని నేటి యువత, భావి తరాలు ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
​కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, నాయకులు కొలిపాక క్రాంతి కుమార్, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గంగిశెట్టి జగదీశ్వర్, గాజర్ల బుచ్చిరాజం, శ్రీపాద వెంకటేష్, జి. వెంకటయ్య, జె. అనిల్, కొలిపాక రంగయ్య, ఎం. జ్యోతి, బుర్రి శేఖర్, జె. సత్యనారాయణ, గాదె శ్రీనివాస్, చీకోటి రమేష్, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

​బాహుబలం న్యూస్, హుజురాబాద్:
చిన్నాభిన్నంగా ఉన్న వందలాది సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి, భారత యూనియన్‌ను పటిష్ఠంగా నిర్మించిన యుగపురుషుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ కొనియాడారు. హుజురాబాద్ పట్టణ గ్రంథాలయంలో గ్రంథాలయ కృషీవలుడు తిరునగరి రమేష్, గ్రంథాలయ అధికారిణి విప్ప పద్మల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ పటేల్ 151వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా చందుపట్ల జనార్ధన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఉన్న 560కి పైగా సంస్థానాలతో పాటు హైదరాబాద్‌ను సైతం తన అచంచలమైన సంకల్పంతో భారత్‌లో విలీనం చేసిన చారిత్రక ఘనత తొలి హోం మంత్రి పటేల్‌దేనని ఉద్ఘాటించారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలను ధారబోసిన పటేల్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ‘భారతరత్న’ పురస్కారం ప్రదానం చేయడంతో పాటు, గుజరాత్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించి, ఆయన జన్మదినాన్ని ‘జాతీయ ఐక్యతా దినం’గా ప్రకటించడం యావత్ భారతావని గర్వించదగ్గ విషయమన్నారు. పటేల్ ప్రదర్శించిన నిరుపమాన దేశభక్తిని, త్యాగగుణాన్ని నేటి యువత, భావి తరాలు ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
​కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, నాయకులు కొలిపాక క్రాంతి కుమార్, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గంగిశెట్టి జగదీశ్వర్, గాజర్ల బుచ్చిరాజం, శ్రీపాద వెంకటేష్, జి. వెంకటయ్య, జె. అనిల్, కొలిపాక రంగయ్య, ఎం. జ్యోతి, బుర్రి శేఖర్, జె. సత్యనారాయణ, గాదె శ్రీనివాస్, చీకోటి రమేష్, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి •. అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు • ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు… గోడప్రతుల ఆవిష్కరణ.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !