బాహు బలంన్యూస్ హుజూరాబాద్,
హుజూరాబాద్ మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ మంజూరు చేయించిన ఈ చెక్కులను, గ్రామ సర్పంచ్ ఇమ్మడి దయాకర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రొంటాల శ్రీకాంత్‌కు రూ. 25,000, మేకల ప్రసాద్‌కు రూ. 60,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఆపద సమయంలో తమకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
Post Views: 9










