బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
హుజూరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ అందించిన నిస్వార్థ సేవలు అందరికీ ఆదర్శప్రాయమని మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాలులో విజయ్‌కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టు శాలువా కప్పి, ఆధ్యాత్మిక కవితా జ్ఞాపిక, పూలబొకే అందజేసి సత్కరించారు. అనంతరం కేకు, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సత్యంగౌడ్ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న పేదలకు ఎల్లవేళలా చేతనైన సాయం అందిస్తూ, ప్రజాసేవనే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్న విజయ్‌కుమార్ అభినందనీయులని కొనియాడారు. మున్సిపల్ చైర్మన్‌గా తన పదవీ కాలంలో హుజూరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. నాయకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరం పరిష్కరించినప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు. స్వార్థాన్ని వీడి మానవతా దృక్పథంతో మెలిగి మానవ జన్మను సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్, బండ నవీన్, బొడ్డు సంజయ్, తునికి వసంత్, నందగిరి శ్రీనివాస్, బాబురావు, వెంకటస్వామి, శాయిల రాజు, జడల సమ్మయ్య, చందు, ముకుందరెడ్డి, రాజుగౌడ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.












