హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

bahubalamtv Reporter
bahubalamtv.in

హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

బాహు బలంన్యూస్ హైదరాబాద్, నవంబర్ 07:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఓసీ వర్గాల సంక్షేమాన్ని విస్మరించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగదని, తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌ మైత్రీవనంలోని కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వెల్మ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆధ్వర్యంలో నాయకులు నూతన చైర్మన్‌కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం హకీంపేటలోని ఆల్ ఇండియా పద్మనాయక వెలమ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావును ఓసీ జేఏసీ తరఫున పోలాడి రామారావు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఓసీ కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించాలి: పోలాడి రామారావు...
ఈ సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఓసీ సామాజిక వర్గాల పేదల అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, సంక్షేమ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీల అమలులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెలమ, ఆర్యవైశ్య, కమ్మ కార్పొరేషన్లను కేవలం నామమాత్రంగా ప్రకటించి, ఎలాంటి నిధులు కేటాయించకుండా, పూర్తిస్థాయి పాలక మండళ్లు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రెడ్డి కార్పొరేషన్‌కు కనీసం చైర్మన్‌ను కూడా నియమించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే అన్ని ఓసీ కార్పొరేషన్లకు చట్టబద్ధతతో కూడిన పూర్తిస్థాయి పాలక మండళ్లను నియమించి, తగినన్ని బడ్జెట్ నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ఈడబ్ల్యూఎస్ (EWS) విద్యార్థులకు కూడా విదేశీ విద్యా నిధి పథకాన్ని పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని, నిరుద్యోగులు, రైతులు, సామాన్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షుడు పాపారావు, ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాసరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఓసీ జేఏసీ రాష్ట్ర కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, వరంగల్ జిల్లా ఓసీ జేఏసీ అధ్యక్షుడు కోలగూరి రాజేశ్వరరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెలమ సంఘాల అధ్యక్షుడు నీలగిరి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి బల్మూరి ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు కమలాకర్‌రావు (సిరిసిల్ల), మనోహర్‌రావు (భూపాలపల్లి), ఐలినేని సాగర్‌రావు (జగిత్యాల), కిషన్‌రావు (మంచిర్యాల), వెంకటరమణారావు (ఆదిలాబాద్), ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు జనగామ కరుణాకర్‌రావులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన వెలమ బంధువులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, ఓసీ జేఏసీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

ఓసీ కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించాలి: పోలాడి రామారావు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి •. అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు • ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు… గోడప్రతుల ఆవిష్కరణ.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !