బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

bahubalamtv Reporter
bahubalamtv.in

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, అక్టోబర్ 22:
బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టినప్పుడే అమరులైన కొమురం భీం, పండుగ సాయన్నలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న స్పష్టం చేశారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
​అనంతరం బీసీ జేఏసీ ముఖ్య నేతలు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ, 'జల్, జమీన్, జంగల్' నినాదంతో నిజాం నవాబు నిరంకుశ పాలనపై సాయుధ పోరాటం సాగించిన వీరుడు కొమురం భీం అని, నాటి అగ్రవర్ణాల అహంకార ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. వారి త్యాగాలు, పోరాటాల చరిత్ర బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.
​ఆ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని అగ్రవర్ణ ఆధిపత్య నిరంకుశ విధానాలపై బహుజనులు ఎల్లప్పుడూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యమై, "మేం బలహీనులం కాదు.. బలవంతులం" అనే నినాదాన్ని చేతల్లో నిరూపిస్తూ రాజ్యాధికార దిశగా ముందుకు కదలాలని వారు ఉద్ఘాటించారు.
​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శులు ఇప్పకాయల సాగర్, ఆలేటి రవీందర్, ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, ఆడెపు శ్రీనివాస్, పుల్లూరి కృష్ణమూర్తి, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు, ప్రజా సంఘాల నాయకులు రామ్ రాజేష్, తిప్పారపు భువనచందర్, మోలుగు రమేష్, ఇల్లందుల సమ్మయ్య, దాట్ల ప్రభాకర్, ఎండీ బాబా, పోతారం అశోక్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, అక్టోబర్ 22:
బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టినప్పుడే అమరులైన కొమురం భీం, పండుగ సాయన్నలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న స్పష్టం చేశారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
​అనంతరం బీసీ జేఏసీ ముఖ్య నేతలు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ, ‘జల్, జమీన్, జంగల్’ నినాదంతో నిజాం నవాబు నిరంకుశ పాలనపై సాయుధ పోరాటం సాగించిన వీరుడు కొమురం భీం అని, నాటి అగ్రవర్ణాల అహంకార ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. వారి త్యాగాలు, పోరాటాల చరిత్ర బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.
​ఆ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని అగ్రవర్ణ ఆధిపత్య నిరంకుశ విధానాలపై బహుజనులు ఎల్లప్పుడూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యమై, “మేం బలహీనులం కాదు.. బలవంతులం” అనే నినాదాన్ని చేతల్లో నిరూపిస్తూ రాజ్యాధికార దిశగా ముందుకు కదలాలని వారు ఉద్ఘాటించారు.
​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శులు ఇప్పకాయల సాగర్, ఆలేటి రవీందర్, ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, ఆడెపు శ్రీనివాస్, పుల్లూరి కృష్ణమూర్తి, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు, ప్రజా సంఘాల నాయకులు రామ్ రాజేష్, తిప్పారపు భువనచందర్, మోలుగు రమేష్, ఇల్లందుల సమ్మయ్య, దాట్ల ప్రభాకర్, ఎండీ బాబా, పోతారం అశోక్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి •. అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు • ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు… గోడప్రతుల ఆవిష్కరణ.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !