బాహు బలంన్యూస్ హుజురాబాద్, అక్టోబర్ 26:
అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ సంప్రదాయంలో భాగంగా హుజురాబాద్ పట్టణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా చివరి ఆదివారం జాతీయ జెండాను ఎగురవేసే ఆనవాయితీని పురస్కరించుకుని, పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్ సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపు మేరకు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మేకల మల్లేశం మాట్లాడుతూ… భారతదేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ సమైక్యతను చాటిచెప్పేందుకే ప్రతి నెలా క్రమం తప్పకుండా సేవాదళ్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవాదళ్ కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజాసేవకు, దేశ సమగ్రతకు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ ఖాలిద్ హుస్సేన్ (17వ వార్డు), బండ వెన్నెల-నవీన్ (16వ వార్డు), మొగిలి (29వ వార్డు), సొల్లు సునీత-బాబు (5వ వార్డు) పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అషు, అలీమ్ హాజరయ్యారు.
వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ రియాజ్ (16వ వార్డు), మహమ్మద్ అజ్జు (17వ వార్డు), మహమ్మద్ మొకిద్ (2వ వార్డు), సలీం (22వ వార్డు) లతో పాటు స్థానిక నాయకులు నాగమణి-మధుకర్, రాఘవులు, మహమ్మద్ గౌస్, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ ఖాజామియా, మహమ్మద్ ముబారక్, ఆదిరెడ్డి, షేక్ జలీల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











