హుజూరాబాద్‌ను కరువు మండలంగా ప్రకటించాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్‌ను కరువు మండలంగా ప్రకటించాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్; నవంబర్04 :
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ను వెంటనే కరువు మండలాల జాబితాలో చేర్చి, ఈ మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ప్రాంతానికి సరైన కాలువ సౌకర్యం లేదని, కొన్ని గ్రామాలకు పూర్తిగా సాగునీటి వసతి కరువైందని పేర్కొన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సరైన వర్షాలు లేక, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. పంట కోత సమయం నాటికి సాగు చేసిన పంటల్లో సగం కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని, పెట్టిన పెట్టుబడి సైతం తిరిగి వచ్చే అవకాశం లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన కరువు మండలాల సర్వేలో హుజూరాబాద్ మండలాన్ని చేర్చకపోవడం శోచనీయమన్నారు.
సాధారణ పరిస్థితుల్లోనే ఈ ప్రాంత రైతులు బోరుబావులు, వ్యవసాయ బావులపై ఆధారపడి సాగు చేసుకుంటున్నారని, యాసంగి సీజన్‌లో రాత్రింబవళ్లు పొలాల వద్దే ఉంటూ ఎన్నో కష్టాలు పడి పంటలను కాపాడుకోవాల్సి వస్తోందని చెప్పారు. అలాంటి రైతులకు ప్రతి విషయంలోనూ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అన్ని రకాల నీటి వసతులు ఉన్న ప్రాంతాలను కరువు మండలాలుగా గుర్తించి, సాగునీటి సౌకర్యం లేని హుజూరాబాద్ మండలాన్ని కరువు జాబితా నుంచి మినహాయించడం తీవ్ర వివక్షేనని అన్నారు.
ప్రస్తుతం భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోయాయని, చెరువులు, కుంటల్లో నీరు పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరువు మండలాల జాబితాలో హుజూరాబాద్ మండలాన్ని చేర్చాలని, లేనిపక్షంలో స్థానిక రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. మండల రైతాంగానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పూసల ప్రభావతి రెడ్డి స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి •. అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు • ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు… గోడప్రతుల ఆవిష్కరణ.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !