నీటిని కాపాడండి.. భవిష్యత్తును నిలబెట్టండి! నేటి నీటి పొదుపే.. రేపటి భవితకు మదుపు రాష్ట్ర ప్రజలకు బీసీ జేఏసీ నాయకుల పిలుపు..

bahubalamtv Reporter
bahubalamtv.in

నీటిని కాపాడండి.. భవిష్యత్తును నిలబెట్టండి! నేటి నీటి పొదుపే.. రేపటి భవితకు మదుపు రాష్ట్ర ప్రజలకు బీసీ జేఏసీ నాయకుల పిలుపు..

​బాహు బలంన్యూస్ హుజూరాబాద్, :
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనదని, నీటిని పొదుపు చేస్తూ భావితరాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హుజూరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్, అధ్యక్షుడు సందేల వెంకన్న పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా అప్రమత్తం కావాలన్నారు. నేడు నీటిని వృథా చేస్తే రేపు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైనంత మేరకే నీటిని వినియోగిస్తూ, ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కోరారు.
​మొక్కలు నాటి సంరక్షించాలి
"నీరు లేనిదే జీవం లేదు.. చెట్లు లేనిదే ప్రకృతికి రక్షణ లేదు" అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నేతలు సూచించారు. విస్తారంగా వర్షాలు కురవాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. ఈ రోజు మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే రేపటి తరాలకు గొప్ప వరంగా మారతాయని చెప్పారు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలన్నారు.
​ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ (ఈవీఎస్), ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, నాయకులు గొర్రె చిరంజీవి, కె. ఆదామ్, కుడికాల ప్రభాకర్, పిట్ట శ్రీనివాస్, తూముల రాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

​బాహు బలంన్యూస్ హుజూరాబాద్, :
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనదని, నీటిని పొదుపు చేస్తూ భావితరాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హుజూరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్, అధ్యక్షుడు సందేల వెంకన్న పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా అప్రమత్తం కావాలన్నారు. నేడు నీటిని వృథా చేస్తే రేపు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైనంత మేరకే నీటిని వినియోగిస్తూ, ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కోరారు.
​మొక్కలు నాటి సంరక్షించాలి
“నీరు లేనిదే జీవం లేదు.. చెట్లు లేనిదే ప్రకృతికి రక్షణ లేదు” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నేతలు సూచించారు. విస్తారంగా వర్షాలు కురవాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. ఈ రోజు మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే రేపటి తరాలకు గొప్ప వరంగా మారతాయని చెప్పారు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలన్నారు.
​ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ (ఈవీఎస్), ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, నాయకులు గొర్రె చిరంజీవి, కె. ఆదామ్, కుడికాల ప్రభాకర్, పిట్ట శ్రీనివాస్, తూముల రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి •. అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు • ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు… గోడప్రతుల ఆవిష్కరణ.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !