రాంపూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం… కేవలం రూ. 3 కే 20 లీటర్ల శుద్ధ జలం.. గ్రామస్తులకు ఉచిత వాటర్ కార్డుల పంపిణీ … త్వరలో అంతిమయాత్ర రథం, ఉచిత కంటి వైద్య శిబిరం.. ఏర్పాటుకు హామీ.. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత – జైపాల్ రెడ్డి దంపతులు …

bahubalamtv Reporter
bahubalamtv.in

రాంపూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం… కేవలం రూ. 3 కే 20 లీటర్ల శుద్ధ జలం.. గ్రామస్తులకు ఉచిత వాటర్ కార్డుల పంపిణీ … త్వరలో అంతిమయాత్ర రథం, ఉచిత కంటి వైద్య శిబిరం.. ఏర్పాటుకు హామీ.. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత – జైపాల్ రెడ్డి దంపతులు …

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, న్యూస్ :
హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని (మినరల్ వాటర్ ప్లాంట్) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి, చైర్మన్ సరిత హాజరై రిబ్బన్ కట్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు.
పేదల ఆరోగ్యం కోసమే వాటర్ ప్లాంట్: ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చానని, గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో వైద్య రంగంలో పనిచేస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలనే సంకల్పంతో తన సతీమణి సరితతో కలిసి 'జయన్న ఫౌండేషన్' స్థాపించానని తెలిపారు. తన స్వగ్రామం సింగాపూర్ అయినప్పటికీ, పుట్టిన గడ్డపై మమకారంతో మండలంలోని అన్ని గ్రామాలకు సేవ చేస్తున్నానన్నారు. రాంపూర్ గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ విజ్ఞప్తి మేరకు ఇక్కడి పేద ప్రజల కోసం కేవలం రూ. 3 కే 20 లీటర్ల శుద్ధమైన నీటిని అందించేలా 24 గంటలు పనిచేసే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులకు రూ. 100 బ్యాలెన్స్‌తో కూడిన ఉచిత వాటర్ కార్డులను అందిస్తున్నామని, రీఛార్జ్ చేసుకుంటే 33 క్యాన్ల నీరు వస్తుందని వివరించారు. సరైన టీడీఎస్ (TDS) ప్రమాణాలతో కూడిన ఈ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరవని సూచించారు.
వైద్య సేవలు, పాఠశాలల అభివృద్ధి:
జయన్న ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు మండలంలోని వివిధ గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 7,000 మందికి పరీక్షలు చేసి, 1,300 మందికి హైదరాబాద్‌లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. అలాగే గైనిక్, ఈఎన్‌టీ, కీళ్ల నొప్పులు, కిడ్నీ రాళ్ల సమస్యలతో బాధపడే పేదలకు సుమారు 4,000 నుండి 5,000 వరకు ఉచిత సర్జరీలు చేయించామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో రాంపూర్‌లోనూ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల మరమ్మతులు చేయించడంతో పాటు విద్యార్థులు తరచూ నీరు తాగేలా 2,000 వాటర్ బాటిళ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.
అంతిమయాత్ర రథం & ఫ్రీజర్ బాక్సుల సదుపాయం:
గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మండలం మొత్తానికి 20 ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచామని, కేవలం రూ. 1,000 నామమాత్రపు నిర్వహణ ఛార్జీతో ఇంటి వద్దకే పంపిస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ కోరిక మేరకు రాంపూర్ గ్రామంలో పేద, ధనిక తేడా లేకుండా అందరి అంతిమయాత్రల కోసం ఒకటి రెండు నెలల్లోనే ప్రత్యేక రథాన్ని (వాహనం) సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అనవసరమైన ఆలోచనలతో బీపీ, షుగర్ వంటి వ్యాధులు తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని, గ్రామంలో ఎవరికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
శుభకార్యాలకు కూలింగ్ వాటర్: చైర్మన్ సరిత
జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత మాట్లాడుతూ.. విద్య, వైద్యంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో ముఖ్యమని భావించి చెల్పూర్, సింగాపూర్, సిర్సపల్లి, కాట్రపల్లి, రాజపల్లి, రాంపూర్ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో శుభకార్యాల సమయంలో ఇబ్బందులు పడకుండా ఇక్కడే కూలింగ్ వాటర్ సౌకర్యం కూడా కల్పించామని, గ్రామస్తులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్లాంట్ నిర్వహణ కోసం గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఏడాది పాటు ప్లాంట్ మరమ్మతుల బాధ్యత తామే చూసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, న్యూస్ :
హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని (మినరల్ వాటర్ ప్లాంట్) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి, చైర్మన్ సరిత హాజరై రిబ్బన్ కట్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు.
పేదల ఆరోగ్యం కోసమే వాటర్ ప్లాంట్: ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చానని, గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో వైద్య రంగంలో పనిచేస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలనే సంకల్పంతో తన సతీమణి సరితతో కలిసి ‘జయన్న ఫౌండేషన్’ స్థాపించానని తెలిపారు. తన స్వగ్రామం సింగాపూర్ అయినప్పటికీ, పుట్టిన గడ్డపై మమకారంతో మండలంలోని అన్ని గ్రామాలకు సేవ చేస్తున్నానన్నారు. రాంపూర్ గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ విజ్ఞప్తి మేరకు ఇక్కడి పేద ప్రజల కోసం కేవలం రూ. 3 కే 20 లీటర్ల శుద్ధమైన నీటిని అందించేలా 24 గంటలు పనిచేసే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులకు రూ. 100 బ్యాలెన్స్‌తో కూడిన ఉచిత వాటర్ కార్డులను అందిస్తున్నామని, రీఛార్జ్ చేసుకుంటే 33 క్యాన్ల నీరు వస్తుందని వివరించారు. సరైన టీడీఎస్ (TDS) ప్రమాణాలతో కూడిన ఈ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరవని సూచించారు.
వైద్య సేవలు, పాఠశాలల అభివృద్ధి:
జయన్న ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు మండలంలోని వివిధ గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 7,000 మందికి పరీక్షలు చేసి, 1,300 మందికి హైదరాబాద్‌లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. అలాగే గైనిక్, ఈఎన్‌టీ, కీళ్ల నొప్పులు, కిడ్నీ రాళ్ల సమస్యలతో బాధపడే పేదలకు సుమారు 4,000 నుండి 5,000 వరకు ఉచిత సర్జరీలు చేయించామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో రాంపూర్‌లోనూ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల మరమ్మతులు చేయించడంతో పాటు విద్యార్థులు తరచూ నీరు తాగేలా 2,000 వాటర్ బాటిళ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.
అంతిమయాత్ర రథం & ఫ్రీజర్ బాక్సుల సదుపాయం:
గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మండలం మొత్తానికి 20 ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచామని, కేవలం రూ. 1,000 నామమాత్రపు నిర్వహణ ఛార్జీతో ఇంటి వద్దకే పంపిస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ కోరిక మేరకు రాంపూర్ గ్రామంలో పేద, ధనిక తేడా లేకుండా అందరి అంతిమయాత్రల కోసం ఒకటి రెండు నెలల్లోనే ప్రత్యేక రథాన్ని (వాహనం) సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అనవసరమైన ఆలోచనలతో బీపీ, షుగర్ వంటి వ్యాధులు తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని, గ్రామంలో ఎవరికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
శుభకార్యాలకు కూలింగ్ వాటర్: చైర్మన్ సరిత
జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత మాట్లాడుతూ.. విద్య, వైద్యంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో ముఖ్యమని భావించి చెల్పూర్, సింగాపూర్, సిర్సపల్లి, కాట్రపల్లి, రాజపల్లి, రాంపూర్ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో శుభకార్యాల సమయంలో ఇబ్బందులు పడకుండా ఇక్కడే కూలింగ్ వాటర్ సౌకర్యం కూడా కల్పించామని, గ్రామస్తులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్లాంట్ నిర్వహణ కోసం గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఏడాది పాటు ప్లాంట్ మరమ్మతుల బాధ్యత తామే చూసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రాంపూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం… కేవలం రూ. 3 కే 20 లీటర్ల శుద్ధ జలం.. గ్రామస్తులకు ఉచిత వాటర్ కార్డుల పంపిణీ … త్వరలో అంతిమయాత్ర రథం, ఉచిత కంటి వైద్య శిబిరం.. ఏర్పాటుకు హామీ.. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత – జైపాల్ రెడ్డి దంపతులు …

సొంతింట్లో దీపాల కాంతులు! ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘనంగా దీపావళి వేడుకలు.. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు. అర్హులందరికీ పక్కా ఇళ్లు అందిస్తాం: ఆర్డీవో జలకుమారి…

హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !