ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి • ప్రత్యేక చట్టం కోసం కేంద్రంపై ఒత్తిడి. • ప్రవీణ్ అరోరా బస్సు యాత్రకు ఓసీ, రెడ్డి జేఏసీ సంపూర్ణ మద్దతు…

bahubalamtv Reporter
bahubalamtv.in

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి • ప్రత్యేక చట్టం కోసం కేంద్రంపై ఒత్తిడి. • ప్రవీణ్ అరోరా బస్సు యాత్రకు ఓసీ, రెడ్డి జేఏసీ సంపూర్ణ మద్దతు…

బాహు బలంన్యూస్ హైదరాబాద్‌ :
కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకురావాలని ఓసీ, రెడ్డి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నగరంలో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర, వివిధ జిల్లాల ఓసీ ఐకాస ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తాము ఏ కులానికీ, మతానికీ వ్యతిరేకం కాదని, పేదరికం ఆధారంగానే ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానం లేకపోవడం వల్ల ఆయా ఫలాలు ఇప్పటికే లబ్ధి పొందిన కుటుంబాలకే పునరావృతమవుతున్నాయని, నిజమైన అర్హులైన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచడం వల్ల ప్రతిభావంతులకు తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్రం ఓసీలలోని పేదలకు ఈడబ్ల్యూఎస్ (EWS) వర్తింపజేసినట్లే, అన్ని వర్గాలకూ ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించాలని కోరారు. దీనిపై చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం జరపాలని, అవసరమైతే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధనకై ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా చేపట్టిన దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ, రెడ్డి, ఆర్యవైశ్య జేఏసీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ యాత్ర ఈనెల 24న తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, రామాయంపేట, తూప్రాన్, మేడ్చల్, కొంపల్లి, హైదరాబాద్ మీదుగా జనగామ, హన్మకొండ నుంచి పరకాల వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాత్రను విజయవంతం చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సామాజిక వర్గాలకు నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి, రెడ్డి జాగృతి అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, ఓసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డితో పాటు ముఖ్య నాయకులు పైళ్ల హరినాథ్‌రెడ్డి, పల్లె జైపాల్‌రెడ్డి, గొట్టెముక్కుల ప్రభాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చిటుకుల నర్సింహారెడ్డి, బోయినపల్లి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !