బాహు బలంన్యూస్ కరీంనగర్,అక్టోబర్ 04:అమలు లో ఉన్న రిజర్వేషన్ల స్థానే ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలనీ ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల ఉద్యమానికి ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలుపు తుందని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.సమాజం లోని అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో సామాజిక సమ న్యాయం జరుగుటకు కుల,మత ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్లు కాకుండా అన్ని సామాజిక వర్గాల పేదలకు ఆర్ధిక స్థితి గతుల రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు కేంద్రం ప్రత్యేక చట్టం రూపొందించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం
ఈ నెల 2న ఢిల్లీ లోని రాజ్ ఘాట్ నుంచి సామాజిక ఉద్యమ కారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్థిక ఆధారిత దేశ వ్యాప్త బస్సు యాత్ర ఉద్యమానికి మద్దతుగా యాత్రలో తెలుగు రాష్ట్రాల్లో ఓసీ ఐకాస ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన రాష్ట్ర ఉమ్మడి జిల్లా ఐకాస ప్రతినిధుల సమావేశంలో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు.
సమాజం లోని అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం జరుగుటకు ప్రస్తుతం అమలవుతున్న కుల మత ప్రాధిక రిజర్వేషన్లు కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో ఆర్ధిక ప్రాతి పదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే తమ ఓసీ జేఏసీ ద్యేయం అని ఇదే మా మూల సిద్ధాంతం అని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
తమ ఓసీ జేఏసీ ఏ ఇతర సామాజిక వర్గీయులకు గాని, ఏ మతానికి వ్యతిరేకం కాదని అన్ని సామాజిక వర్గాల్లోని పేదలందరికి విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అని పోలాడి రామారావు అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 80సంవత్సరాలు గడుస్తున్నా పేదలు పేదలుగానే ఉంటున్నారని,ధన వంతులు మరింత ధనవంతులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దీనికి ప్రధాన కారణం
ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల వ్యవస్థ లో క్రిమిలేయర్ విధానం అమలు లేకపోవడం వల్ల రిజర్వేషన్లు పొందిన కుటుంబాల వారే తిరిగి మరలా రిజర్వేషన్లు దక్కించుకుంటున్నారన్నారు. దీంతో అవకాశం ఉండి రిజర్వేషన్ల ఫలాలు నోచుకోక అట్టడుగు వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రామారావు అభిప్రాయ పడ్డారు.
దీంతో సామాజిక సమతూకం దెబ్బతిని యువతరంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో సామాజిక సమన్యాయం జరుగుటకు ప్రస్తుతం అమలవుతున్న కుల, మత ప్రాతి పదిక రిజర్వేషన్లు కాకుండా ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని సామాజిక వర్గాల పేదలకు సమ న్యాయం జరుగుతుందని పోలాడి రామారావు అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన అనంతరం ఆనాటి సామాజిక పరిస్థితులకనుగుణంగా వెనుకబడ్డ దళిత, ఆదివాసుల కోసం పదేళ్ల కాలపరిమితి తో కేవలం విద్యా, ఉద్యోగ రంగాల్లో 22.5 శాతం శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు.
ఓటు బ్యాంక్ స్వార్త రాజకీయాల కోసం 10ఏళ్లకు ముగించాల్సిన అట్టి రిజర్వేషన్లను మరింతగా 50 శాతానికి రిజర్వేషన్లు పెంచి మరిన్ని సామాజిక వర్గాలకు సైతం వర్తింప జేసీ విద్యా, ఉద్యోగాల తో పాటు రాజకీయ రంగాల్లో కూడా అమలు పర్చుతున్నారన్నారు.
కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగడం లేదని రిజర్వేషన్ల శాతాన్ని మరింతగా పెంచాలనే డిమాండ్లు ఊపందు కుంటున్నాయన్నారు. దీంతో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు పెంచాల్సిన దుస్థితి దాపురించిందాన్నారు. దీంతో ప్రతిభావంతులకు అవకాశాలు సన్నగిల్లి మిగతా దేశాలకు వలసలు పెరిగి దేశ మేధో సంపత్తికి విఘాతం ఏర్పడి అభివృద్ధిలో వెనుక బడి నష్టం జరుగుతుందని రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండేందుకు అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్యా,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల ఫలాలు అందుటకుగాను కుల,మత ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్లు కాకుండా ఆర్ధిక స్థితి గతుల ఆధారిత రిజర్వేషన్లు కల్పించి సమ న్యాయం జరపాలన్నారు.
ఇందుకు ప్రత్యేక చట్టం తేవడానికి రాజ్యాంగ సవరణ జరుపుటకు పార్లమెంట్ లో చర్చించి కేంద్రం ప్రత్యేక చట్టబద్ద కమిషన్ వేసి అన్ని వర్గాల ఆర్ధిక స్థితి గతులను అధ్యయనం చేసి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశం లో రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కరివేద నర్సింహారెడ్డి,కొత్త కొండ రవీందర్ రావు, అండెం రమణా రెడ్డి, జిల్లా అంజయ్య, వెన్నమనేని విక్రమ సింహా రావు తదితరలు ఉన్నారు.












