ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

bahubalamtv Reporter
bahubalamtv.in

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

బాహు బలంన్యూస్ కరీంనగర్‌ అర్బన్, అక్టోబరు 2:
సత్యం, అహింసలనే వజ్రాయుధాలుగా మలచుకుని పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్‌ శివారులోని రాంపూర్‌ జాతీయ రహదారి చౌరస్తా వద్ద ఉన్న మహాత్ముని కాంస్య విగ్రహానికి సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. పదవులు, అధికారాన్ని ఆశించకుండా కేవలం దేశ స్వాతంత్య్రం, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా తుదిశ్వాస వరకు పోరాడిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. 'సాదాసీదా జీవనం.. ఉన్నత ఆలోచనలు' అనే జీవన విధానాన్ని స్వయంగా ఆచరించి ప్రపంచానికే దిక్సూచిగా నిలిచారని ప్రశంసించారు. ఆయన చూపిన సత్యం, అహింస, సహనం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను నిత్య జీవితంలో అలవర్చుకోవడమే జాతిపితకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి
సమాజంలోని అన్ని వర్గాల్లోని పేదలకు సమన్యాయం చేకూరాలంటే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా కేవలం ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా పోలాడి రామారావు గళమెత్తారు. ఈ సమున్నత లక్ష్య సాధన కోసం న్యూఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించి, దేశవ్యాప్త బస్సు యాత్ర చేపట్టిన సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్‌ అరోరా పోరాటానికి ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఈ బస్సు యాత్రలో తమ జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ వాసవీ క్లబ్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్, నగర మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్‌ గౌడ్, పుట్ట నరేందర్, ప్రముఖ నాయకులు ముద్దసాని కృష్ణారెడ్డి, పైడి రవి, గంప అనంతం, గొర్ల సంతోష్, పోల్సాని దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్‌ అర్బన్, అక్టోబరు 2:
సత్యం, అహింసలనే వజ్రాయుధాలుగా మలచుకుని పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్‌ శివారులోని రాంపూర్‌ జాతీయ రహదారి చౌరస్తా వద్ద ఉన్న మహాత్ముని కాంస్య విగ్రహానికి సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. పదవులు, అధికారాన్ని ఆశించకుండా కేవలం దేశ స్వాతంత్య్రం, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా తుదిశ్వాస వరకు పోరాడిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ‘సాదాసీదా జీవనం.. ఉన్నత ఆలోచనలు’ అనే జీవన విధానాన్ని స్వయంగా ఆచరించి ప్రపంచానికే దిక్సూచిగా నిలిచారని ప్రశంసించారు. ఆయన చూపిన సత్యం, అహింస, సహనం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను నిత్య జీవితంలో అలవర్చుకోవడమే జాతిపితకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి
సమాజంలోని అన్ని వర్గాల్లోని పేదలకు సమన్యాయం చేకూరాలంటే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా కేవలం ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా పోలాడి రామారావు గళమెత్తారు. ఈ సమున్నత లక్ష్య సాధన కోసం న్యూఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించి, దేశవ్యాప్త బస్సు యాత్ర చేపట్టిన సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్‌ అరోరా పోరాటానికి ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఈ బస్సు యాత్రలో తమ జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ వాసవీ క్లబ్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్, నగర మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్‌ గౌడ్, పుట్ట నరేందర్, ప్రముఖ నాయకులు ముద్దసాని కృష్ణారెడ్డి, పైడి రవి, గంప అనంతం, గొర్ల సంతోష్, పోల్సాని దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !