ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

bahubalamtv Reporter
bahubalamtv.in

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

బహు బలం న్యూస్ కరీంనగర్ (ప్రత్యేక ప్రతినిధి):
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాసిన బహిరంగ లేఖ ప్రతులను మంగళవారం కరీంనగర్‌లో పాత్రికేయులకు ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా లేఖలోని పలు కీలక డిమాండ్లను లేవనెత్తుతూ ఆయన విమర్శలు గుప్పించారు:
1. విద్యారంగంపై నిర్లక్ష్యం వీడాలి – జీవో 97 రద్దు చేయాలి:
విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో మరియు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడంలో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
మేనిఫెస్టోలో పేర్కొన్న నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయింది.
‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ పేరుతో రాష్ట్రంలో 105 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిరంకుశ జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలి.
2. అన్నదాతలను ఆదుకోండి – సన్నవడ్లకే కాకుండా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలి:
రైతులకు ఎకరానికి ఏటా రూ. 15,000 చొప్పున ఇస్తామన్న రైతుబంధు హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు.
రుణమాఫీ పథకంలో ఇంకా మిగిలిపోయిన అర్హులైన 30 శాతం మంది రైతులకు వెంటనే రుణమాఫీ వర్తింపజేయాలి.
రైతు బీమా అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలి.
క్వింటాలుకు రూ. 500 బోనస్ హామీని కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం రైతులకు తీరని ద్రోహం; అన్ని రకాల ధాన్యానికి బోనస్ అందించాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ దళారులు రైతులను నిలువునా దోచుకోకుండా, ప్రభుత్వమే మద్దతు ధరతో సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలి.
రైతులకు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించడంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలి. ఎస్సారెస్పీ (SRSP) ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలి.
3. కార్పొరేషన్లకు నిధులేవి? ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాను పకడ్బందీగా అమలు చేయండి:
వివిధ ఓసీ వర్గాల పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ, వాటికి పూర్తిస్థాయి పాలక మండళ్లు ఏర్పాటు చేయకపోవడమే కాకుండా తగిన నిధులు కూడా కేటాయించలేదు.
రెడ్డి కార్పొరేషన్‌కు అసలు పాలక మండలిని నేటికీ నియమించకపోవడం తీవ్ర శోచనీయం.
విదేశీ విద్యను అందించే ఓవర్సీస్ పథకంలో ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులకు అవకాశం కల్పించాలి.
వివిధ రెసిడెన్షియల్ కాలేజీలు, పాఠశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేస్తూ, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక ఈడబ్ల్యూఎస్ రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటు చేయాలి.
ఈడబ్ల్యూఎస్ కోటాలో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ పోస్టులను అదే అభ్యర్థులతో వెంటనే భర్తీ చేయాలి. ఈ రిజర్వేషన్ల సమర్థ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో విభాగం ఉండాలి.
4. కరీంనగర్ అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం:
కరీంనగర్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు మానేరు నది ఇరువైపులా నిలిచిపోయిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
నగరానికే తలమానికమైన కేబుల్ బ్రిడ్జి పరిసరాలు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి; అక్కడ కనీసం లైట్లు కూడా వెలగకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
ఎల్ఎండీ సమీపంలోని ఐటీ టవర్స్‌లో కంపెనీలు లేక భవనాలు బోసిపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు; స్థానిక నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి.
కార్పొరేషన్‌లో విలీనమైన శివారు కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుంతలమయంగా మారిన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి.
5. ప్రజా సంక్షేమం – ఇతర ముఖ్య డిమాండ్లు:
గ్రామాలు, పట్టణాల్లో విచ్చలవిడిగా వెలిసిన అక్రమ మద్యం బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చేసి, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్యను నియంత్రించాలి.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారి వద్ద నుంచే బతుకమ్మ చీరలను సేకరించి మహిళలకు సకాలంలో పంపిణీ చేయాలి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులకు తప్పనిసరిగా భాగస్వామ్యం కల్పించాలి.
ఈ ప్రజా సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని పోలాడి రామారావు తన లేఖలో హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !