డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

bahubalamtv Reporter
bahubalamtv.in

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

బాహు బలంన్యూస్ హనుమకొండ,:
ప్రముఖ ప్రజాకవి, రచయిత, తత్వవేత్త, అంతర్జాతీయ వరల్డ్‌ రికార్డు గ్రహీత డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం లభించింది. సాహిత్య రచనలు, సమాజ సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్‌ కల్చరల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, శ్రీ విరాట్‌ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్‌ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించాయి.
హనుమకొండలోని జయకృష్ణ కాన్ఫరెన్స్‌ హాలులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సంస్థల వ్యవస్థాపకుడు పోలోజు రాజ్‌కుమార్‌ అధ్యక్షతన సత్యంగౌడ్‌ను అత్యంత ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా ఆయనకు గురు కిరీటాన్ని ధరింపజేసి, మెడల్‌ వేసి, పట్టుశాలువాతో సత్కరించి ‘విశ్వ కళావిభూషణ్‌’ జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సత్యంగౌడ్‌ అపార ఆధ్యాత్మిక జ్ఞానంతో సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారని, ఆయన రచనలు, సేవలు సమాజానికి ఎంతో విలువైనవని కొనియాడారు. అనంతరం సత్కార గ్రహీత సత్యంగౌడ్‌ ప్రసంగిస్తూ.. "మానవుడు స్వార్థాన్ని విడనాడి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం సాగించాలి. సమాజానికి, దేశానికి యువతే మూలస్తంభాలు.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్‌ వంగల శాంతికృష్ణాచార్య, ప్రముఖ సినీ నటుడు ఆర్‌.ఎస్‌.నంద, నటి నుపుర్‌ ముఖర్జీ, ప్రముఖ న్యాయవాది ఎ.కిరణ్‌కుమార్‌, సామాజికవేత్తలు వనపర్తి పద్మజ, మల్లికార్జున్‌, గుంటుక రాధిక, పత్రిక సంపాదకుడు బిడ్డల ప్రశాంత్‌, ప్రతినిధులు వలబోజు మోహన్‌రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్‌, అడ్డంకి నాగరాజు, అక్కనపల్లి యాదగిరిగౌడ్‌తో పాటు పలువురు కళాకారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హనుమకొండ,:
ప్రముఖ ప్రజాకవి, రచయిత, తత్వవేత్త, అంతర్జాతీయ వరల్డ్‌ రికార్డు గ్రహీత డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం లభించింది. సాహిత్య రచనలు, సమాజ సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్‌ కల్చరల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, శ్రీ విరాట్‌ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్‌ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించాయి.
హనుమకొండలోని జయకృష్ణ కాన్ఫరెన్స్‌ హాలులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సంస్థల వ్యవస్థాపకుడు పోలోజు రాజ్‌కుమార్‌ అధ్యక్షతన సత్యంగౌడ్‌ను అత్యంత ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా ఆయనకు గురు కిరీటాన్ని ధరింపజేసి, మెడల్‌ వేసి, పట్టుశాలువాతో సత్కరించి ‘విశ్వ కళావిభూషణ్‌’ జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సత్యంగౌడ్‌ అపార ఆధ్యాత్మిక జ్ఞానంతో సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారని, ఆయన రచనలు, సేవలు సమాజానికి ఎంతో విలువైనవని కొనియాడారు. అనంతరం సత్కార గ్రహీత సత్యంగౌడ్‌ ప్రసంగిస్తూ.. “మానవుడు స్వార్థాన్ని విడనాడి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం సాగించాలి. సమాజానికి, దేశానికి యువతే మూలస్తంభాలు.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్‌ వంగల శాంతికృష్ణాచార్య, ప్రముఖ సినీ నటుడు ఆర్‌.ఎస్‌.నంద, నటి నుపుర్‌ ముఖర్జీ, ప్రముఖ న్యాయవాది ఎ.కిరణ్‌కుమార్‌, సామాజికవేత్తలు వనపర్తి పద్మజ, మల్లికార్జున్‌, గుంటుక రాధిక, పత్రిక సంపాదకుడు బిడ్డల ప్రశాంత్‌, ప్రతినిధులు వలబోజు మోహన్‌రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్‌, అడ్డంకి నాగరాజు, అక్కనపల్లి యాదగిరిగౌడ్‌తో పాటు పలువురు కళాకారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !