బాహు బలంన్యూస్ కమలాపూర్, సెప్టెంబర్ 25: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ మండల నాయకుడు నాయినేని రవీందర్‌రావు సతీమణి రజిత గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉప్పల్‌లోని వారి నివాసానికి చేరుకున్న ఆయన.. నాయకులతో కలిసి రజిత పార్థివదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పుట్టెడు దుఃఖంలో ఉన్న రవీందర్‌రావును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు కొనిశెట్టి మునీందర్, హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాయినేని తిరుపతిరావు, సర్పంచులు వాల ప్రదీప్‌రావు, పోలాడి శ్రీరంగారావు, కమలాపూర్ మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, ఉప్పల్ మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్‌రావు, నాయకులు పోలాడి యాదగిరిరావు, అన్నమనేని శ్రీనివాసరావు, తక్కళ్లపల్లి దేవేందర్‌రావు, పోలాడి రాంగోపాల్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు వేలాదిగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు.











