గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

bahubalamtv Reporter
bahubalamtv.in

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

బాహు బలంన్యూస్, ​కరీంనగర్ కలెక్టరేట్, : తెలంగాణ పౌరుషానికి, ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె చూపిన పోరాట బాట నేటి తరానికి నిత్య స్ఫూర్తిదాయకమని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. శనివారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టరేట్ రహదారిలోని ఆమె విగ్రహ కూడలి వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ... నాడు నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ‘భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం’ దొరల గుండెల్లో నిద్రపోయిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం ప్రపంచానికే తెలంగాణ తెగువను చాటిచెప్పిందన్నారు. ఇటీవలే విడుదలైన ‘సెన్సేషన్ ప్యారడైజ్’ చిత్రంలో సమ్మక్క పాత్ర సైతం అచ్చం ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తలపిస్తోందని గుర్తుచేశారు.

ఓట్ల కోసమే వీరుల పేర్లు.. ఆశయాలు బలిపీఠంపైనే!

వీరనారి ఐలమ్మ త్యాగాలను నేటి పాలకులు కేవలం ఎన్నికల ఓట్ల లబ్ధి కోసమే వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలకు దండలు వేసి మొక్కుబడి నివాళులు అర్పించే నాయకులు, వారి ఆశయాలను మాత్రం బలిపీఠం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. "నాడు నిజాం రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు పేదల రక్తాన్ని జలగల్లా పీలిస్తే.. నేడు కార్పొరేట్ గద్దలు, అవినీతి పెత్తందార్లు కొత్త రూపంలో సామాన్యులను దోచుకుంటున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సరైన సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులు ఎవరూ భిక్షగా వేయరని, ఐలమ్మ చూపిన తిరుగుబాటు మార్గంలోనే పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

తమిళనాడులో జల్లికట్టు సంప్రదాయం కోసం ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఈ విషయంలో పాలకులు తాత్సారం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐలమ్మ ఆశయ సాధన కోసం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకై ప్రజా సంఘాల జేఏసీ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయీబ్రాహ్మణ సంఘాల అధ్యక్షుడు జంపాల నర్సయ్య, బీసీ హక్కుల సాధన రాష్ట్ర నాయకుడు సుద్దాల రాజయ్య, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, బోయినపల్లి శ్రీనివాసరావు, అండెం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్, ​కరీంనగర్ కలెక్టరేట్, : తెలంగాణ పౌరుషానికి, ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె చూపిన పోరాట బాట నేటి తరానికి నిత్య స్ఫూర్తిదాయకమని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. శనివారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టరేట్ రహదారిలోని ఆమె విగ్రహ కూడలి వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ… నాడు నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ‘భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం’ దొరల గుండెల్లో నిద్రపోయిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం ప్రపంచానికే తెలంగాణ తెగువను చాటిచెప్పిందన్నారు. ఇటీవలే విడుదలైన ‘సెన్సేషన్ ప్యారడైజ్’ చిత్రంలో సమ్మక్క పాత్ర సైతం అచ్చం ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తలపిస్తోందని గుర్తుచేశారు.

ఓట్ల కోసమే వీరుల పేర్లు.. ఆశయాలు బలిపీఠంపైనే!

వీరనారి ఐలమ్మ త్యాగాలను నేటి పాలకులు కేవలం ఎన్నికల ఓట్ల లబ్ధి కోసమే వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలకు దండలు వేసి మొక్కుబడి నివాళులు అర్పించే నాయకులు, వారి ఆశయాలను మాత్రం బలిపీఠం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. “నాడు నిజాం రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు పేదల రక్తాన్ని జలగల్లా పీలిస్తే.. నేడు కార్పొరేట్ గద్దలు, అవినీతి పెత్తందార్లు కొత్త రూపంలో సామాన్యులను దోచుకుంటున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సరైన సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులు ఎవరూ భిక్షగా వేయరని, ఐలమ్మ చూపిన తిరుగుబాటు మార్గంలోనే పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

తమిళనాడులో జల్లికట్టు సంప్రదాయం కోసం ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఈ విషయంలో పాలకులు తాత్సారం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐలమ్మ ఆశయ సాధన కోసం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకై ప్రజా సంఘాల జేఏసీ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయీబ్రాహ్మణ సంఘాల అధ్యక్షుడు జంపాల నర్సయ్య, బీసీ హక్కుల సాధన రాష్ట్ర నాయకుడు సుద్దాల రాజయ్య, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, బోయినపల్లి శ్రీనివాసరావు, అండెం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !