గురువులపై వైకాపా గూండాల దాష్టీకం! జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ప్రజాగ్రహం తప్పదు…. ఓసీ జేఏసీ, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

గురువులపై వైకాపా గూండాల దాష్టీకం! జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ప్రజాగ్రహం తప్పదు…. ఓసీ జేఏసీ, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

బాహు బలంన్యూస్ హైదరాబాద్. సెప్టెంబర్ 22 :
కష్టపడి మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై విజయవాడలో వైకాపా శ్రేణులు, రౌడీ మూకలతో దాడి చేయించడం హేయమైన చర్య అని ఓసీ జేఏసీ, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రంగా మండిపడ్డారు. సమాజానికి దిశానిర్దేశం చేసే గురువులపై దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓసీ ఐకాస రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ అమానుష ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు, బాధిత ఉపాధ్యాయులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జగన్‌కు ప్రజాగ్రహంతో పాటు రాజకీయ, సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.
రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు..
విజయవాడలోని శాప్‌ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యాలయం వద్ద తమ ధ్రువపత్రాలతో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులపై వైకాపా శ్రేణులు, అసాంఘిక శక్తులు పథకం ప్రకారమే విరుచుకుపడ్డారని రామారావు ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌, వైకాపా నేత దేవినేని అవినాష్‌ కనుసన్నల్లోనే రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో ఈ పాశవిక దాడి జరిగిందని, పలువురు ఉపాధ్యాయులతో పాటు శాప్‌ సిబ్బంది కూడా గాయపడ్డారని తెలిపారు. విజయవాడలో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163, పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 ఆంక్షలు అమలులో ఉన్నందున వైకాపా నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడాలి
రాజకీయ విద్వేషాలతో ఉద్యోగులపై దాడులు చేయడం ముమ్మాటికీ నేరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన నిందితులతో పాటు వారి వెనకుండి ప్రోత్సహించిన రాజకీయ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా సమగ్ర విచారణ జరిపించి, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.
రాజకీయ వివాదాలకు హింస ఎన్నటికీ పరిష్కారం కాదని, నియామకాలపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలే తప్ప భౌతిక దాడులకు తెగబడటం సమర్థనీయం కాదన్నారు. దాడికి గురైన ఉపాధ్యాయులకు తగిన రక్షణ, భరోసా కల్పించాలని.. వారికి న్యాయం జరిగే వరకూ ఓసీ జేఏసీ అండగా పోరాడుతుందని పోలాడి రామారావు స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !