ఉపాధ్యాయ అభ్యర్థులపై దాడి దుర్మార్గం: దోషులను కఠినంగా శిక్షించాలి. ఘటనకు బాధ్యత వహించి వైఎస్‌ జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌..

bahubalamtv Reporter
bahubalamtv.in

ఉపాధ్యాయ అభ్యర్థులపై దాడి దుర్మార్గం: దోషులను కఠినంగా శిక్షించాలి. ఘటనకు బాధ్యత వహించి వైఎస్‌ జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌..

బాహు బలంన్యూస్ కరీంనగర్ సెప్టెంబర్ 21 :
విజయవాడలో న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డీఎస్సీ అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థులపై వైకాపా శ్రేణులు గూండాలతో దాడి చేయించడాన్ని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రంగా ఖండించారు. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉండే కాబోయే ఉపాధ్యాయులపై రౌడీ మూకలు, బ్లేడ్‌ బ్యాచ్‌లతో విరుచుకుపడటం అమానుషమని, ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగి రమేశ్‌, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ల కనుసన్నల్లోనే రౌడీషీటర్లు, సంఘవిద్రోహ శక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన నిరుద్యోగ యువతపై భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు, ఉపాధ్యాయ అభ్యర్థులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, భవిష్యత్తులో వైకాపా అధినేత జగన్‌కు రాజకీయ, సామాజిక బహిష్కరణ తప్పదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉపాధ్యాయుల రక్తం కళ్లచూసిన నిందితులను, వారికి సహకరించిన రాజకీయ నేతలను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. బాధితులకు తక్షణ న్యాయం చేయాలని, అభ్యర్థుల భద్రతకు పూర్తి భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్ సెప్టెంబర్ 21 :
విజయవాడలో న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డీఎస్సీ అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థులపై వైకాపా శ్రేణులు గూండాలతో దాడి చేయించడాన్ని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రంగా ఖండించారు. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉండే కాబోయే ఉపాధ్యాయులపై రౌడీ మూకలు, బ్లేడ్‌ బ్యాచ్‌లతో విరుచుకుపడటం అమానుషమని, ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాజీ మంత్రి జోగి రమేశ్‌, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ల కనుసన్నల్లోనే రౌడీషీటర్లు, సంఘవిద్రోహ శక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన నిరుద్యోగ యువతపై భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు, ఉపాధ్యాయ అభ్యర్థులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, భవిష్యత్తులో వైకాపా అధినేత జగన్‌కు రాజకీయ, సామాజిక బహిష్కరణ తప్పదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉపాధ్యాయుల రక్తం కళ్లచూసిన నిందితులను, వారికి సహకరించిన రాజకీయ నేతలను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. బాధితులకు తక్షణ న్యాయం చేయాలని, అభ్యర్థుల భద్రతకు పూర్తి భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….