బాహు బలంన్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్ 20 :
హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ పద్మశాలి సేవా సంఘం ఆవరణలో ప్రతిష్ఠించిన గణనాథుడిని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ – తిరుమల దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
అనంతరం సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ.. పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో పూజాదికాలు జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పూజా కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు సుంకెనపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సంగెం ఐలయ్య, ఉపాధ్యక్షుడు తలకొక్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలకొక్కుల రమేష్, విగ్రహ దాత జడల మోహన్ కుమార్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.











