బాహు బలంన్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 20:
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్‌ఛార్జి పొన్నం అనూప్ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనిగరపు వెంకటేశ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనిగరపు వెంకటేశ్ కేక్ కట్ చేయించి, పొన్నం అనూప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న అనూప్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో ఎల్కతుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సింగిల్ విండో డైరెక్టర్ శనిగరపు స్వరూప, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్ గొడిశాల రాజయ్య గౌడ్, బూత్ కమిటీ ఇన్‌ఛార్జి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాక రమేశ్, వడ్డెర సంఘం నాయకులు వల్లపు యాదగిరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భవన నిర్మాణ సంక్షేమ మండలి మండల అధ్యక్షుడు రేణిగుంట్ల సాంబయ్య, మహిళా సంక్షేమ మండలి మండల కన్వీనర్ ఆరెపల్లి స్వరూప, బౌద్ధ సొసైటీ (బీఎస్ఐ) రాష్ట్ర నాయకులు కామర లక్ష్మణ్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ, ఆటో యూనియన్ నాయకులు శ్రీను, రమేశ్, రాజు, నాయకుడు శ్రీపతి భిక్షపతితో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.











