రాష్ట్రస్థాయి కరాటేలో హుజూరాబాద్ పంచ్.. పతకాల పంట!

bahubalamtv Reporter
bahubalamtv.in

రాష్ట్రస్థాయి కరాటేలో హుజూరాబాద్ పంచ్.. పతకాల పంట!

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 09 :గోదావరిఖనిలోని అమృతా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో హుజూరాబాద్ విద్యార్థులు పతకాల పంట పండించారు. గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, మాస్టర్ ఎస్.కే. జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 400 మంది పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో హుజూరాబాద్ విద్యార్థులు వరుస విజయాలతో తమ సత్తా చాటారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు
పోటీల్లో సిహెచ్. సాయి చరణ్ (13 ఏళ్లు) కటాస్, స్పారింగ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించగా.. ఎస్.కే. సాదుల్లా బాబా (14 ఏళ్లు) కటాస్‌లో స్వర్ణం, స్పారింగ్‌లో రజతం గెలుపొందారు. అలాగే ఎం. భాను తేజ (15 ఏళ్లు), జున్ను కావ్య (16 ఏళ్లు), పి. సహస్ర (15 ఏళ్లు), పి. కిరణ్మయి (13 ఏళ్లు), జి. నక్షత్ర (12 ఏళ్లు), ఎం.డి. హుమేరా తస్లీమ్ (10 ఏళ్లు), వి. వినూత్న (10 ఏళ్లు), పి. నిస్సి (9 ఏళ్లు), ఎం.డి. సహార (8 ఏళ్లు) స్వర్ణ పతకాలు సాధించారు. 7 సంవత్సరాల విభాగంలో హేమ కటాస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
విజేతలకు ప్రముఖుల అభినందనలు
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, మాస్టర్ ఎస్.కే. జలీల్‌ను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, డైరెక్టర్లు గోపాల్, వెంగళరావు, కాంగ్రెస్ నాయకుడు గోస్కుల మధు తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !