నవభారత నిర్మాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం. ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (బి.ఇ). కరీంనగర్ జడ్పీ ఎదుట విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు..

bahubalamtv Reporter
bahubalamtv.in

నవభారత నిర్మాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం. ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (బి.ఇ). కరీంనగర్ జడ్పీ ఎదుట విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు..

బాహు బలంన్యూస్,కరీంనగర్, సెప్టెంబర్ 15 :
భారతరత్న, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరింగ్ దిగ్గజం, సాగు-తాగునీటి ప్రాజెక్టులతో దేశ నిర్మాణానికి పునాదులు వేసిన నవభారత నిర్మాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (బి.ఇ) పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య 165వ జయంతి (జాతీయ ఇంజనీర్స్ డే) సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు (బి.ఇ) మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబరు 15ను భారత్‌తో పాటు శ్రీలంక, టాంజానియా దేశాల్లోనూ ఇంజనీర్స్ డేగా నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గాను ‘ఆధునిక మైసూర్ రూపకర్త’గా నిలిచారని గుర్తుచేశారు. ఆయన ఇంజనీరింగ్ ప్రస్థానాన్ని వివరిస్తూ:
ఉద్యోగ ప్రస్థానం: 1885లో బొంబాయి ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరి నాసిక్, ధూలే, పూణేల్లో పనిచేశారు. 1894లో సింధ్ ప్రావిన్స్‌లోని సుక్కురు మున్సిపాలిటీకి శాశ్వత తాగునీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు. 1896లో సూరత్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, 1897-1899 మధ్య పూణేలో అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా, అనంతరం ఇరిగేషన్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆటోమేటిక్ గేట్ల ఆవిష్కరణ: 1901లో బొంబాయిలో శానిటరీ ఇంజనీర్‌గా, శానిటరీ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తూ నీటిపారుదల కమిషన్ ఎదుట విప్లవాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 1903లో ఖడక్‌వాస్లా వద్ద ఉన్న లేక్ ఫైఫ్ రిజర్వాయర్‌లో వరద నియంత్రణ కోసం తన పేరిట పేటెంట్ పొందిన ఆటోమేటిక్ గేట్లను రూపొందించి నిర్మించారు. నీటి నిర్వహణలో నూతన ‘బ్లాక్ సిస్టమ్’ను ప్రవేశపెట్టారు.
అంతర్జాతీయ అధ్యయనం: 1904లో సిమ్లాలో జరిగిన ఇరిగేషన్ కమిషన్‌లో బొంబాయి ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. 1907లో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు 1908లో ఈజిప్ట్, కెనడా, రష్యా దేశాలను సందర్శించారు.
హైదరాబాద్ డ్రైనేజీ – వరద నివారణ: 1909లో హైదరాబాద్ నిజాం ప్రభుత్వానికి కన్సల్టింగ్ ఇంజనీర్‌గా వ్యవహరించి, మూసీ నది తీవ్ర వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, నగరానికి ఆ రోజుల్లోనే అత్యాధునిక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు.
తుంగభద్ర గేట్లు – ప్రాజెక్టులు: 1909లో మైసూర్ ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా, పీడబ్ల్యూడీ కార్యదర్శిగా నియమితులై ప్రసిద్ధ కృష్ణరాజసాగర్ (కేఆర్‌ఎస్) ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లతో పాటు స్టాప్ లాగ్ (స్టాప్ బ్లాక్స్) గేట్లను ఏర్పాటు చేయడంలో ఆయన సాంకేతికత కీలక పాత్ర పోషించింది.
దివాన్‌గా పాలన – భారతరత్న: 1913లో మైసూర్ సంస్థానానికి దివాన్ (ప్రధానమంత్రి)గా ప్రజా పనుల శాఖ, రైల్వేలను ఆధునీకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘సర్’, ‘KCIE’ నైట్‌హుడ్ గౌరవాలను అందించగా, భారత ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. 1927 నుంచి 1955 వరకు టాటా స్టీల్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగానూ సేవలందించారు.
ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం:
దేశ ప్రగతికి బాటలు వేస్తున్న ఇంజనీర్లందరికీ, ముఖ్యంగా తనతోటి 1982-86 బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్ మిత్రులకు పోలాడి రామారావు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 18న వరంగల్-హన్మకొండలో నిర్వహించనున్న 1982-86 బ్యాచ్ ఇంజనీరింగ్ ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులంతా రిజిస్ట్రేషన్ చేసుకొని పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్లు రవి ప్రసాద్, వెంకటేశం, ప్రవీణ్, సురేందర్ రెడ్డి, వెంకన్నలతో పాటు పలు ప్రజాసంఘాల బాధ్యులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !