తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

bahubalamtv Reporter
bahubalamtv.in

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

బాహు బలంన్యూస్,కరీంనగర్ సెప్టెంబర్ 17 :
‘బాంచెన్’ అన్న ప్రజలే బందూకులు పట్టి, నిరంకుశ పాలనపై భీకర పోరాటం చేసి సాధించుకున్నదే తెలంగాణ విముక్తి అని రైతు, ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, వీరోచిత పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని ఓసీ ఐకాస సమాఖ్య కార్యాలయ ఆవరణలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం నెత్తుటి పోరాటాలు చేసిందన్నారు. బైరాన్‌పల్లి, పరకాల, మహ్మదాపూర్ వంటి వీరోచిత ఘటనలు, షోయబుల్లాఖాన్ బలిదానం, అనభేరి ప్రభాకర్‌రావు, భూపతిరెడ్డిల వీరమరణాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. రజాకార్లు జాతీయ జెండాను ఎగురవేసిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపడం, మహిళలను చిత్రహింసలకు గురిచేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే.. తెలంగాణ ఆడబిడ్డలు రోకలిబండలు, కారపుముద్దలతో ఎదురొడ్డి తరిమికొట్టారని గుర్తుచేశారు.
1935లో ఆంధ్ర మహాసభ ద్వారా మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, బద్దం ఎల్లారెడ్డి, పీవీ నరసింహారావుల, దుగ్గిరాల వెంకట్రావు,
మార్గనిర్దేశనంతో తెలంగాణ పోరాటం సరికొత్త మలుపు తిరిగిందని తెలిపారు. అనంతరం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ (పోలీస్ యాక్షన్) ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని స్పష్టం చేశారు.
ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాల కోసమే గత, ప్రస్తుత పాలకులు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని, సిగ్గు చేటు, అని మండిపడ్డారు.
ఇది అమరుల త్యాగాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల ఉమ్మడి జిల్లా నాయకులు జంపాల నర్సయ్య, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, మహంకాళి రాజన్న, పోల్సాని రామారావు, కొత్తకొండ రవీందర్‌రావు, చింతిరెడ్డి రమణారెడ్డి, మల్లా రెడ్డి , జూపాక జెడ్సన్,
తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !