హైదరాబాదులో ‘బేడ బుడగ జంగాల’ ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయించాలి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతి సానుకూలంగా స్పందించిన మంత్రి. బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు…

bahubalamtv Reporter
bahubalamtv.in

హైదరాబాదులో ‘బేడ బుడగ జంగాల’ ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయించాలి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతి సానుకూలంగా స్పందించిన మంత్రి. బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు…

బాహు బలంన్యూస్ హైదరాబాద్, మే 20 :
హైదరాబాద్ మహానగరంలో రాష్ట్రస్థాయి ‘బేడ బుడగ జంగాల’ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు కోరారు. మంగళవారం నాడు ఆయన నేతృత్వంలోని సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.
వసతి లేక నిరుపేదల అవస్థలు
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు మాట్లాడుతూ.. వివిధ రకాల వ్యక్తిగత, ప్రభుత్వ, ఉపాధి పనుల నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నిరుపేద బేడ బుడగ జంగం కులబాంధవులు ప్రతిరోజు హైదరాబాద్ నగరానికి వస్తుంటారని తెలిపారు. అయితే, నగరంలో వారికి సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయాల్లో బస చేయడానికి చోటు లేక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్లాట్‌ఫారాలపైన పడుకుంటూ నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మగౌరవ భవన నిర్మాణం అత్యవసరం
సంచార జీవులైన తమ సామాజిక వర్గానికి రాజధాని నగరంలో ఒక శాశ్వత వసతి గృహం ఉండటం ఎంతో అవసరమని సిరిపాటి వేణు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సును, పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాదులో 1500 గజాల స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతోనే రాష్ట్రస్థాయి ‘బేడ బుడగ జంగాల ఆత్మగౌరవ భవనం’ నిర్మించి ఇవ్వాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు, నిరుద్యోగులకు, రోగులకు ఎంతో ఆసరాగా ఉంటుందని వివరించారు.
మంత్రి సానుకూల స్పందన.. సంఘం కృతజ్ఞతలు
సంఘం ప్రతినిధులు సమర్పించిన వినతిపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సానుకూలంగా స్పందించారు. బేడ బుడగ జంగాల సమస్యలను సావధానంగా విన్న మంత్రి.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, స్థల కేటాయింపు మరియు భవన నిర్మాణ విషయమై సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కి బేడ బుడగ జంగం జన సంఘం తరఫున ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుని కుమార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ పులేందర్ మరియు సంఘానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భేటీ అనంతరం నాయకులు "జై బేడ బుడగ జంగం.. జై జై బేడ బుడగ జంగం" అంటూ నినాదాలు చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హైదరాబాద్, మే 20 :
హైదరాబాద్ మహానగరంలో రాష్ట్రస్థాయి ‘బేడ బుడగ జంగాల’ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు కోరారు. మంగళవారం నాడు ఆయన నేతృత్వంలోని సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.
వసతి లేక నిరుపేదల అవస్థలు
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు మాట్లాడుతూ.. వివిధ రకాల వ్యక్తిగత, ప్రభుత్వ, ఉపాధి పనుల నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నిరుపేద బేడ బుడగ జంగం కులబాంధవులు ప్రతిరోజు హైదరాబాద్ నగరానికి వస్తుంటారని తెలిపారు. అయితే, నగరంలో వారికి సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయాల్లో బస చేయడానికి చోటు లేక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్లాట్‌ఫారాలపైన పడుకుంటూ నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మగౌరవ భవన నిర్మాణం అత్యవసరం
సంచార జీవులైన తమ సామాజిక వర్గానికి రాజధాని నగరంలో ఒక శాశ్వత వసతి గృహం ఉండటం ఎంతో అవసరమని సిరిపాటి వేణు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సును, పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాదులో 1500 గజాల స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతోనే రాష్ట్రస్థాయి ‘బేడ బుడగ జంగాల ఆత్మగౌరవ భవనం’ నిర్మించి ఇవ్వాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు, నిరుద్యోగులకు, రోగులకు ఎంతో ఆసరాగా ఉంటుందని వివరించారు.
మంత్రి సానుకూల స్పందన.. సంఘం కృతజ్ఞతలు
సంఘం ప్రతినిధులు సమర్పించిన వినతిపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సానుకూలంగా స్పందించారు. బేడ బుడగ జంగాల సమస్యలను సావధానంగా విన్న మంత్రి.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, స్థల కేటాయింపు మరియు భవన నిర్మాణ విషయమై సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కి బేడ బుడగ జంగం జన సంఘం తరఫున ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుని కుమార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ పులేందర్ మరియు సంఘానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భేటీ అనంతరం నాయకులు “జై బేడ బుడగ జంగం.. జై జై బేడ బుడగ జంగం” అంటూ నినాదాలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !