ఎస్సీ గ్రూప్-1 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి *. మంత్రి అడ్లూరి, ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి బేడ బుడగ జంగం జన సంఘం వినతి…..

bahubalamtv Reporter
bahubalamtv.in

ఎస్సీ గ్రూప్-1 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి *. మంత్రి అడ్లూరి, ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి బేడ బుడగ జంగం జన సంఘం వినతి…..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 20: తెలంగాణలో ఎస్సీ గ్రూప్-1 పరిధిలోని 15 ఉప కులాల ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం రూ. 5,000 కోట్ల నిధితో ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించింది.
హైదరాబాదులో ఆత్మగౌరవ భవనం నిర్మించాలి..
వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చే నిరుపేద కులబాంధవులకు బస చేయడానికి వసతి లేక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో నానా అవస్థలు పడుతున్నారని సిరిపాటి వేణు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులను దూరం చేసేందుకు హైదరాబాద్‌లో 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతోనే 'బేడ బుడగ జంగాల ఆత్మగౌరవ భవనం' నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కుల గణన, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి..
వర్గీకరణ జరిగి ఏడాది గడుస్తున్నా గ్రూప్-1 కులాలకు ఆశించిన గుర్తింపు లభించలేదని వేణు పేర్కొన్నారు. గ్రూప్-1 పరిధిలోని 15 కులాల జనాభా దాదాపు 10 లక్షలు ఉండగా
అందులో ఒక్క బేడ బుడగ జంగాల జనాభానే 2 లక్షలకు పైగా ఉందన్నారు. అందువల్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అత్యధిక జనాభా కలిగిన బేడ బుడగ జంగం వర్గానికి చైర్మన్ పదవి కేటాయించాలని, రాబోయే నామినేటెడ్ పదవుల్లోనూ ఈ కులాలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం సానుకూల హామీ
జన సంఘం విజ్ఞప్తులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ గ్రూప్-1 లోని అత్యంత వెనుకబడిన కులాల సమస్యలను, ఆత్మగౌరవ భవన ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవుని కుమార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ పులేందర్ తదితరులు పాల్గొన్నారు.
,

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 20: తెలంగాణలో ఎస్సీ గ్రూప్-1 పరిధిలోని 15 ఉప కులాల ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం రూ. 5,000 కోట్ల నిధితో ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించింది.
హైదరాబాదులో ఆత్మగౌరవ భవనం నిర్మించాలి..
వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చే నిరుపేద కులబాంధవులకు బస చేయడానికి వసతి లేక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో నానా అవస్థలు పడుతున్నారని సిరిపాటి వేణు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులను దూరం చేసేందుకు హైదరాబాద్‌లో 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతోనే ‘బేడ బుడగ జంగాల ఆత్మగౌరవ భవనం’ నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కుల గణన, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి..
వర్గీకరణ జరిగి ఏడాది గడుస్తున్నా గ్రూప్-1 కులాలకు ఆశించిన గుర్తింపు లభించలేదని వేణు పేర్కొన్నారు. గ్రూప్-1 పరిధిలోని 15 కులాల జనాభా దాదాపు 10 లక్షలు ఉండగా
అందులో ఒక్క బేడ బుడగ జంగాల జనాభానే 2 లక్షలకు పైగా ఉందన్నారు. అందువల్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అత్యధిక జనాభా కలిగిన బేడ బుడగ జంగం వర్గానికి చైర్మన్ పదవి కేటాయించాలని, రాబోయే నామినేటెడ్ పదవుల్లోనూ ఈ కులాలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం సానుకూల హామీ
జన సంఘం విజ్ఞప్తులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ గ్రూప్-1 లోని అత్యంత వెనుకబడిన కులాల సమస్యలను, ఆత్మగౌరవ భవన ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవుని కుమార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ పులేందర్ తదితరులు పాల్గొన్నారు.
,

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !