రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

bahubalamtv Reporter
bahubalamtv.in

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

బాహు బలంన్యూస్, కరీంనగర్ మే 14 :
రాష్ట్రంలోని అన్నదాతల సంక్షేమాన్ని విస్మరించి, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంతో పాటు, రైతాంగ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈనెల 30న కరీంనగర్ వేదికగా 'రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన' సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితర నేతలతో కలిసి సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.
కొనుగోలు కేంద్రాల్లో అక్రమాల పర్వం
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ శూన్యమని, దీనివల్ల మిల్లర్లు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై రైతును నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 6 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని సైతం కామన్ గ్రేడ్ కింద జమకడుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ చెల్లింపులో సైతం అనేక కొర్రీలు పెడుతూ అన్నదాతల నోరు కొడుతున్నారని విమర్శించారు.
రైతు భరోసాపై పాలకుల వైఫల్యం
పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ ముగిసిపోతున్నా నేటికీ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీల కొరతతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, ఎండల తీవ్రతకు ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోతుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
రాజకీయాలకతీతంగా సమరశంఖం
తమ పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకో వ్యతిరేకం కాదని, కేవలం రైతాంగ ప్రయోజనాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 30న కరీంనగర్‌లో నిర్వహించే రైతు మహాగర్జనకు సుమారు రెండు లక్షల మంది రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సభకు మద్దతు తెలిపిన ప్రముఖులు:
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవీందర్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతుల పక్షాన పోరాడేందుకు తామంతా సిద్ధమని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బండ సంపత్ రెడ్డి, చింతల రమణా రెడ్డి, పోల్సాని రామారావు, పంజాల శ్రీనివాస్, మహిపాల్, రాజేందర్ రావు, శ్రీపతి రావు, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కొండాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్, కరీంనగర్ మే 14 :
రాష్ట్రంలోని అన్నదాతల సంక్షేమాన్ని విస్మరించి, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంతో పాటు, రైతాంగ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈనెల 30న కరీంనగర్ వేదికగా ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన’ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితర నేతలతో కలిసి సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.
కొనుగోలు కేంద్రాల్లో అక్రమాల పర్వం
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ శూన్యమని, దీనివల్ల మిల్లర్లు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై రైతును నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 6 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని సైతం కామన్ గ్రేడ్ కింద జమకడుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ చెల్లింపులో సైతం అనేక కొర్రీలు పెడుతూ అన్నదాతల నోరు కొడుతున్నారని విమర్శించారు.
రైతు భరోసాపై పాలకుల వైఫల్యం
పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ ముగిసిపోతున్నా నేటికీ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీల కొరతతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, ఎండల తీవ్రతకు ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోతుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
రాజకీయాలకతీతంగా సమరశంఖం
తమ పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకో వ్యతిరేకం కాదని, కేవలం రైతాంగ ప్రయోజనాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 30న కరీంనగర్‌లో నిర్వహించే రైతు మహాగర్జనకు సుమారు రెండు లక్షల మంది రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సభకు మద్దతు తెలిపిన ప్రముఖులు:
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవీందర్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతుల పక్షాన పోరాడేందుకు తామంతా సిద్ధమని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బండ సంపత్ రెడ్డి, చింతల రమణా రెడ్డి, పోల్సాని రామారావు, పంజాల శ్రీనివాస్, మహిపాల్, రాజేందర్ రావు, శ్రీపతి రావు, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కొండాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !