పాలకులు కళ్లు తెరవాలి.. రైతు గర్జన వినాలి!….. కరీంనగర్‌లో 30న సమరభేరి: పోలాడి రామారావు…

bahubalamtv Reporter
bahubalamtv.in

పాలకులు కళ్లు తెరవాలి.. రైతు గర్జన వినాలి!….. కరీంనగర్‌లో 30న సమరభేరి: పోలాడి రామారావు…

బాహు బలంన్యూస్ కరీంనగర్ మే 13;రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, రైతులను విస్మరిస్తే పాలకులకు పుట్టగతులు ఉండవని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా, ఈ నెల 30న కరీంనగర్ వేదికగా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక సభ విజయవంతం కోసం బుధవారం ఆయన కరీంనగర్‌లో విస్తృతంగా పర్యటించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయగా, వారంతా సానుకూలంగా స్పందించి సభకు సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు ముఖ్య నాయకులతో కలిసి రామారావు సభకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.

అడుగడుగునా అన్నదాతకు అన్యాయమే!

అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని, మిల్లర్లు, సిబ్బంది కుమ్మక్కై తేమ పేరుతో క్వింటాల్‌కు 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ చెల్లింపులో వందలాది కొర్రీలు పెట్టి రైతులను ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా యాసంగి ముగిసినా నేటికీ రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

లక్షలాది మందితో కరీంనగర్ కదలాలి

రాజకీయాలకు అతీతంగా కేవలం రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా నిర్వహించే ఈ మహాసభకు సుమారు రెండు లక్షల మంది రైతులు హాజరవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని పంటలకు వెంటనే బోనస్ నిధులు విడుదల చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలిచి చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని రామారావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చందుపట్ల సుధాకర్ రెడ్డి, జువ్వాడి కరుణాకర్ రావు, లింగన్నగారి బాలకిషన్ రావు, ఆకుల కోటి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !