వృద్ధాప్య, బీడీ పెన్షన్లపై స్పష్టత ఇవ్వాలి: పవన్ రెడ్డి.

bahubalamtv Reporter
bahubalamtv.in

వృద్ధాప్య, బీడీ పెన్షన్లపై స్పష్టత ఇవ్వాలి: పవన్ రెడ్డి.

బాహు బలంన్యూస్ ఇల్లందకుంట, ఆగస్టు 13 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, బీడీ కార్మికులకు పెంచిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ మండల సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల పెన్షన్ల దరఖాస్తుల కోసం ప్రభుత్వం అవకాశం కల్పించినా, మీ-సేవ కేంద్రాల సైట్‌లో వృద్ధాప్య, బీడీ కార్మికుల దరఖాస్తులకు సంబంధించిన ఆప్షన్ కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్క్యులర్‌లోనూ వీటికి సంబంధించిన కాలమ్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అసలు వీరి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారా లేదా, సైట్‌లో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత నివ్వాలని కోరారు. ఆగస్టు 15 నుంచి ఇచ్చే పెంచిన పెన్షన్లను వృద్ధులు, బీడీ కార్మికులకు కూడా వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !