తెలంగాణ ఉద్యమకారులకు ‘సైనిక సమ్మాన్’ పెన్షన్ ఇవ్వాలి.. రేవంత్ ప్రభుత్వం హామీలు తక్షణమే నెరవేర్చాలి. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు డిమాండ్..

bahubalamtv Reporter
bahubalamtv.in

తెలంగాణ ఉద్యమకారులకు ‘సైనిక సమ్మాన్’ పెన్షన్ ఇవ్వాలి.. రేవంత్ ప్రభుత్వం హామీలు తక్షణమే నెరవేర్చాలి. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు డిమాండ్..

హైదరాబాద్ బాహు బలంన్యూస్ ఆగస్టు 11: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించాలని, రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి 'సైనిక సమ్మాన్' తరహా పెన్షన్ ప్రకటించాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గట్టిగా డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉద్యమ ముఖ్య నాయకుల సమావేశంలో పోలాడి రామారావు ముఖ్య ప్రసంగం చేశారు.
45 ఏళ్ల సుదీర్ఘ పోరాటం – చిన్నభిన్నమైన బతుకులు
1969 నుంచి 2013 వరకు దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని పోలాడి రామారావు గుర్తుచేశారు. లాఠీ దెబ్బలు తిని, చీకటి జైలు జీవితాలను అనుభవించడం వల్ల ఉద్యమకారుల బతుకులు తీవ్రంగా దెబ్బతిని చిన్నభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ త్యాగాలు చేసిన పోరాట యోధులను తక్షణమే గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఉద్యమకారులకు నెలకు ₹25 వేల పెన్షన్
క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, నెలకు ₹25,000 పెన్షన్ మంజూరు చేయాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని, ఉచిత విద్యతో పాటు మెరుగైన కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.
ఇంటి స్థలం, ఉద్యోగం, నామినేటెడ్ పదవులు
వయోపరిమితితో నిమిత్తం లేకుండా ప్రతి ఉద్యమకారుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వమే స్వయంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని పోలాడి రామారావు స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లోని నామినేటెడ్ పదవుల్లోనూ ఉద్యమకారులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఉద్యమ నాయకులు దేవుళ్లపల్లి రామ్మూర్తి, జనగామ కరుణాకర్ రావు, కనుకం శంకర్, శ్రీపాద సత్యనారాయణ, చింతిరెడ్డి రమణారెడ్డి, కొమ్మిడి నిరంజన్ రెడ్డి, చకిలం రమణయ్య, కొనిశెట్టి మునీందర్, పొలాడి శ్రీరంగారావు, రత్నాకర్ శర్మ తదితర వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హైదరాబాద్ బాహు బలంన్యూస్ ఆగస్టు 11: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించాలని, రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి ‘సైనిక సమ్మాన్’ తరహా పెన్షన్ ప్రకటించాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గట్టిగా డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉద్యమ ముఖ్య నాయకుల సమావేశంలో పోలాడి రామారావు ముఖ్య ప్రసంగం చేశారు.
45 ఏళ్ల సుదీర్ఘ పోరాటం – చిన్నభిన్నమైన బతుకులు
1969 నుంచి 2013 వరకు దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని పోలాడి రామారావు గుర్తుచేశారు. లాఠీ దెబ్బలు తిని, చీకటి జైలు జీవితాలను అనుభవించడం వల్ల ఉద్యమకారుల బతుకులు తీవ్రంగా దెబ్బతిని చిన్నభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ త్యాగాలు చేసిన పోరాట యోధులను తక్షణమే గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఉద్యమకారులకు నెలకు ₹25 వేల పెన్షన్
క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, నెలకు ₹25,000 పెన్షన్ మంజూరు చేయాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని, ఉచిత విద్యతో పాటు మెరుగైన కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.
ఇంటి స్థలం, ఉద్యోగం, నామినేటెడ్ పదవులు
వయోపరిమితితో నిమిత్తం లేకుండా ప్రతి ఉద్యమకారుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వమే స్వయంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని పోలాడి రామారావు స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లోని నామినేటెడ్ పదవుల్లోనూ ఉద్యమకారులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఉద్యమ నాయకులు దేవుళ్లపల్లి రామ్మూర్తి, జనగామ కరుణాకర్ రావు, కనుకం శంకర్, శ్రీపాద సత్యనారాయణ, చింతిరెడ్డి రమణారెడ్డి, కొమ్మిడి నిరంజన్ రెడ్డి, చకిలం రమణయ్య, కొనిశెట్టి మునీందర్, పొలాడి శ్రీరంగారావు, రత్నాకర్ శర్మ తదితర వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !