చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి – బోర్నపల్లిలో ఘనంగా చేనేత దినోత్సవం – చేనేత మహిళా కార్మికులకు శాలువాలతో సన్మానం

bahubalamtv Reporter
bahubalamtv.in

చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి – బోర్నపల్లిలో ఘనంగా చేనేత దినోత్సవం – చేనేత మహిళా కార్మికులకు శాలువాలతో సన్మానం

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 07:
హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ పంచాయతీ వార్డు కార్యాలయంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత మహిళా కార్మికులను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ... నాటి నుంచి నేటి వరకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు చేనేత హస్తకళ ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థానం పొందిన ఈ చేనేత కార్మికులు నేటికీ ఆర్థిక కష్టాల్లో ఉండడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, 'నేతన్న హస్తం' భీమా సౌకర్యంతో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత నాయకులు ఐకమత్యంతో సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు సంఘం సత్యనారాయణ, ఇప్పకాయల సాగర్, మంద భిక్షపతి, చిలకమర్రి శ్రీనివాస్,కొలిపాక క్రాంతి, సృజన, బింగి రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన చేనేత మహిళా కార్మికులు రమాదేవి, శారద, లలిత, సరోజన, శశికళ, వసంత, లక్ష్మి, శ్రీలత, రాజమణి, అరుణ, వాణి, వరలక్ష్మి తదితరులను ఘనంగా సన్మానించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 07:
హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ పంచాయతీ వార్డు కార్యాలయంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత మహిళా కార్మికులను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ… నాటి నుంచి నేటి వరకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు చేనేత హస్తకళ ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థానం పొందిన ఈ చేనేత కార్మికులు నేటికీ ఆర్థిక కష్టాల్లో ఉండడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, ‘నేతన్న హస్తం’ భీమా సౌకర్యంతో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత నాయకులు ఐకమత్యంతో సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు సంఘం సత్యనారాయణ, ఇప్పకాయల సాగర్, మంద భిక్షపతి, చిలకమర్రి శ్రీనివాస్,కొలిపాక క్రాంతి, సృజన, బింగి రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన చేనేత మహిళా కార్మికులు రమాదేవి, శారద, లలిత, సరోజన, శశికళ, వసంత, లక్ష్మి, శ్రీలత, రాజమణి, అరుణ, వాణి, వరలక్ష్మి తదితరులను ఘనంగా సన్మానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….