మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, అన్నదానం – అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

bahubalamtv Reporter
bahubalamtv.in

మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, అన్నదానం – అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో వెలకట్టలేనివని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని కొనియాడారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగి ప్రతాప సుధాకర్ - సరోజ దంపతుల పదవీ విరమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, వారి కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ... సమాజానికి అనునిత్యం ఉపయోగపడే మున్సిపల్ కార్మికుల శ్రమను గు గుర్తించి, వారిని సన్మానించాలనే ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ - సరోజ దంపతుల ఉదారతకు, సద్భావనకూ నిదర్శనమని ప్రశంసించారు. శ్రమ విలువను గుర్తించి, కార్మికుల పట్ల గౌరవాన్ని చాటుకున్న ఆ దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రతాప మంజుల, ప్రతాప తార, కో-ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు. రాజయ్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో వెలకట్టలేనివని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని కొనియాడారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగి ప్రతాప సుధాకర్ – సరోజ దంపతుల పదవీ విరమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, వారి కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… సమాజానికి అనునిత్యం ఉపయోగపడే మున్సిపల్ కార్మికుల శ్రమను గు గుర్తించి, వారిని సన్మానించాలనే ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ – సరోజ దంపతుల ఉదారతకు, సద్భావనకూ నిదర్శనమని ప్రశంసించారు. శ్రమ విలువను గుర్తించి, కార్మికుల పట్ల గౌరవాన్ని చాటుకున్న ఆ దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రతాప మంజుల, ప్రతాప తార, కో-ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు. రాజయ్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….