మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడమే లక్ష్యం: పోలాడి రామారావు సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు.. వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

bahubalamtv Reporter
bahubalamtv.in

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడమే లక్ష్యం: పోలాడి రామారావు సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు.. వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

బాహు బలంన్యూస్ కరీంనగర్ మే 12 : రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం మే 30న కరీంనగర్ వేదికగా 'రైతు మహాగర్జన సమరభేరి' సభను నిర్వహించనున్నట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. మంగళవారం కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాసంలో ఆయనను కలిసి సభకు రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ, రైతు గర్జన గోడప్రతులను ఆవిష్కరించి సభకు పూర్తి మద్దతు ప్రకటించారు.
కొనుగోళ్లలో జాప్యం.. రైతులపై దోపిడీ
అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ చెల్లింపులో అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లర్లు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కింద జమ కడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతు భరోసా ఏదీ?
పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పోలాడి ధ్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, అన్ని పంటలకు బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మందితో సమరభేరి
రాజకీయాలకతీతంగా రైతాంగ సమస్యలపై పోరాడటమే లక్ష్యంగా ఈ నెల 30న కరీంనగర్‌లో సుమారు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రామారావు వెల్లడించారు. ఈ మహాగర్జన స హెచ్భ యుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు మోతె గంగారెడ్డి, మెరుగు సంపత్, ఎర్రబెల్లి సంపత్ రావు, పంజాల శ్రీనివాస్, రంగు భాస్కరాచారి, కేశవరెడ్డి, గౌతమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్ మే 12 : రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం మే 30న కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహించనున్నట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. మంగళవారం కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాసంలో ఆయనను కలిసి సభకు రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ, రైతు గర్జన గోడప్రతులను ఆవిష్కరించి సభకు పూర్తి మద్దతు ప్రకటించారు.
కొనుగోళ్లలో జాప్యం.. రైతులపై దోపిడీ
అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ చెల్లింపులో అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లర్లు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కింద జమ కడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతు భరోసా ఏదీ?
పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పోలాడి ధ్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, అన్ని పంటలకు బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మందితో సమరభేరి
రాజకీయాలకతీతంగా రైతాంగ సమస్యలపై పోరాడటమే లక్ష్యంగా ఈ నెల 30న కరీంనగర్‌లో సుమారు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రామారావు వెల్లడించారు. ఈ మహాగర్జన స హెచ్భ యుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు మోతె గంగారెడ్డి, మెరుగు సంపత్, ఎర్రబెల్లి సంపత్ రావు, పంజాల శ్రీనివాస్, రంగు భాస్కరాచారి, కేశవరెడ్డి, గౌతమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !