ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం….. 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ అన్నదాతల నిలువు దోపిడీని అరికట్టాలి.:… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..

bahubalamtv Reporter
bahubalamtv.in

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం….. 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ అన్నదాతల నిలువు దోపిడీని అరికట్టాలి.:… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..

బాహు బలంన్యూస్ ఎల్కతుర్తి, మే 11:
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 30న కరీంనగర్‌లో భారీ ఎత్తున 'రైతు మహాగర్జన' సమరభేరి సభను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం ఎల్కతుర్తిలో రైతు నాయకులతో కలిసి ఈ సభకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ప్రక్రియ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్‌ను అడిగితే రకరకాల కొర్రీలు పెడుతున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకే పాలకులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం ఆరబెట్టే క్రమంలో ఎండలకు తాళలేక రైతులు మృత్యువాత పడటం కలచివేస్తోందన్నారు.
వైఫల్యాల ప్రభుత్వం
రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ పెట్టుబడి సాయం అందకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. తక్షణమే రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు, రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ నెల 30న కరీంనగర్‌లో నిర్వహించే సమరభేరి సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, తాటిపల్లి రాజన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ ఎల్కతుర్తి, మే 11:
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 30న కరీంనగర్‌లో భారీ ఎత్తున ‘రైతు మహాగర్జన’ సమరభేరి సభను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం ఎల్కతుర్తిలో రైతు నాయకులతో కలిసి ఈ సభకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ప్రక్రియ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్‌ను అడిగితే రకరకాల కొర్రీలు పెడుతున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకే పాలకులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం ఆరబెట్టే క్రమంలో ఎండలకు తాళలేక రైతులు మృత్యువాత పడటం కలచివేస్తోందన్నారు.
వైఫల్యాల ప్రభుత్వం
రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ పెట్టుబడి సాయం అందకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. తక్షణమే రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు, రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ నెల 30న కరీంనగర్‌లో నిర్వహించే సమరభేరి సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, తాటిపల్లి రాజన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !