డాక్టర్‌ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయస్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కార ప్రధానం.

bahubalamtv Reporter
bahubalamtv.in

డాక్టర్‌ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయస్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కార ప్రధానం.

బాహు బలంన్యూస్ కరీంనగర్ మార్చి 29 :
ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వగురువు, ప్రజాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ గ్రహీతగా సత్యం గౌడ్ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఘనంగా సన్మానం
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన విశ్వ కళా విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్య, ప్రముఖ హాస్య నటులు ఆర్.ఎస్. నంద, సామాజికవేత్త మల్లికార్జున్, న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, 'కరీంనగర్ భూమి' ఎడిటర్ బిడ్డల ప్రశాంత్ తదితరులు సత్యం గౌడ్‌కు పట్టుశాలువా కప్పి, మెడల్ ధరింపజేసి, ఉగాది జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సత్యం గౌడ్ అపారమైన జ్ఞానం కలిగిన దైవాంశ సంభూతులని, ఆయన ప్రసంగాలు సమాజానికి వెలకట్టలేని విలువలని ప్రశంసించారు. వెలకట్టలేని మానవత్వాన్ని కాపాడుతూ, సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
యువతకు సందేశం
పురస్కార గ్రహీత డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో ఉంచుకొని, నిర్మలంగా మార్చుకొని ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. దేశానికి మూలస్తంభాలైన నేటి యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలని పిలుపునిచ్చారు. మనుషులు ఒకరికొకరు నష్టం చేసుకోకుండా, సహకరించుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో లోక కల్యాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కళాకారులను, కవులను నిరంతరం ప్రోత్సహిస్తున్న పోలోజు రాజకుమార్ సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు వలబోజు మోహన్ రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్, అడ్డంకి నాగరాజు, సకల కళా రత్న అక్కనపల్లి యాదగిరి గౌడ్, కవి వైరాగ్యం ప్రభాకర్, రాధికతో పాటు పలువురు కళాకారులు, టీవీ నటులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్ మార్చి 29 :
ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వగురువు, ప్రజాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ గ్రహీతగా సత్యం గౌడ్ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఘనంగా సన్మానం
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన విశ్వ కళా విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్య, ప్రముఖ హాస్య నటులు ఆర్.ఎస్. నంద, సామాజికవేత్త మల్లికార్జున్, న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, ‘కరీంనగర్ భూమి’ ఎడిటర్ బిడ్డల ప్రశాంత్ తదితరులు సత్యం గౌడ్‌కు పట్టుశాలువా కప్పి, మెడల్ ధరింపజేసి, ఉగాది జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సత్యం గౌడ్ అపారమైన జ్ఞానం కలిగిన దైవాంశ సంభూతులని, ఆయన ప్రసంగాలు సమాజానికి వెలకట్టలేని విలువలని ప్రశంసించారు. వెలకట్టలేని మానవత్వాన్ని కాపాడుతూ, సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
యువతకు సందేశం
పురస్కార గ్రహీత డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో ఉంచుకొని, నిర్మలంగా మార్చుకొని ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. దేశానికి మూలస్తంభాలైన నేటి యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలని పిలుపునిచ్చారు. మనుషులు ఒకరికొకరు నష్టం చేసుకోకుండా, సహకరించుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో లోక కల్యాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కళాకారులను, కవులను నిరంతరం ప్రోత్సహిస్తున్న పోలోజు రాజకుమార్ సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు వలబోజు మోహన్ రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్, అడ్డంకి నాగరాజు, సకల కళా రత్న అక్కనపల్లి యాదగిరి గౌడ్, కవి వైరాగ్యం ప్రభాకర్, రాధికతో పాటు పలువురు కళాకారులు, టీవీ నటులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !