దళిత ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు: హుజూరాబాద్‌లో మిన్నంటిన నిరసన జ్వాలలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

దళిత ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు: హుజూరాబాద్‌లో మిన్నంటిన నిరసన జ్వాలలు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌ మార్చి 29 :
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేల పట్ల ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు కౌశిక్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
రాజకీయ అనుభవాన్ని గౌరవించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడు
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చల్లూరి రాహుల్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి మొదటి నుంచి దళితులంటే చిన్నచూపు ఉందని ధ్వజమెత్తారు. "పార్టీలతో సంబంధం లేకుండా అందరూ గౌరవించే సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరించడం సిగ్గుచేటు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమానమైన రాజకీయ అనుభవం గల శాసనసభ్యునిపై నోరు పారేసుకోవడం ఆయన అహంకారానికి పరాకాష్ట" అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని, అటువంటి వ్యక్తి శాసనసభలో ఉండేందుకు ఏమాత్రం అర్హుడు కాదని, తక్షణమే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిక
కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలో ఆయనను అడుగుపెట్టనివ్వబోమని నాయకులు హెచ్చరించారు. తక్షణమే దళిత సమాజానికి, కడియం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దళిత ఎమ్మెల్యేలను అవమానించడం అంటే యావత్ దళిత జాతినే అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ సమ్మన్న, నియోజకవర్గ నాయకులు సందమల్ల నరేష్, సందమల్ల బాబు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు చిట్యాల రేవంత్, కందుల సందీప్, మండల ఉపాధ్యక్షుడు సందీప్, అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, కె.ఆర్. గౌడ్, రవితేజ, తిరుమల్, అజిత్, కొండ్ర అనిల్, విజయ్ తో పాటు భారీ సంఖ్యలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌ మార్చి 29 :
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేల పట్ల ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు కౌశిక్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
రాజకీయ అనుభవాన్ని గౌరవించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడు
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చల్లూరి రాహుల్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి మొదటి నుంచి దళితులంటే చిన్నచూపు ఉందని ధ్వజమెత్తారు. “పార్టీలతో సంబంధం లేకుండా అందరూ గౌరవించే సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరించడం సిగ్గుచేటు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమానమైన రాజకీయ అనుభవం గల శాసనసభ్యునిపై నోరు పారేసుకోవడం ఆయన అహంకారానికి పరాకాష్ట” అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని, అటువంటి వ్యక్తి శాసనసభలో ఉండేందుకు ఏమాత్రం అర్హుడు కాదని, తక్షణమే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిక
కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలో ఆయనను అడుగుపెట్టనివ్వబోమని నాయకులు హెచ్చరించారు. తక్షణమే దళిత సమాజానికి, కడియం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దళిత ఎమ్మెల్యేలను అవమానించడం అంటే యావత్ దళిత జాతినే అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ సమ్మన్న, నియోజకవర్గ నాయకులు సందమల్ల నరేష్, సందమల్ల బాబు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు చిట్యాల రేవంత్, కందుల సందీప్, మండల ఉపాధ్యక్షుడు సందీప్, అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, కె.ఆర్. గౌడ్, రవితేజ, తిరుమల్, అజిత్, కొండ్ర అనిల్, విజయ్ తో పాటు భారీ సంఖ్యలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !