24వ వార్డు అభివృద్ధి నా ధ్యేయం: ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నాంపెళ్లి శ్రీనివాస్.

bahubalamtv Reporter
bahubalamtv.in

24వ వార్డు అభివృద్ధి నా ధ్యేయం: ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నాంపెళ్లి శ్రీనివాస్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ఫిబ్రవరి 09:పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపెళ్లి శ్రీనివాస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి గల్లీని చుడుతూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ భారీ మద్దతును కూడగట్టుకుంటున్నారు. ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డు రూపురేఖలు మార్చడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గెలిచిన ఏడాది కాలంలోనే వార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బాయలకాడికి వెళ్లే రాగట్లో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు, హనుమాన్ టెంపుల్ సమీపంలో ప్రజల నీటి అవసరాల కోసం ప్రత్యేక వాటర్ ట్యాంక్‌ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే హనుమాన్ టెంపుల్ పరిసర ప్రాంతాలతో పాటు, పద్మశాలీ కాలనీలో పూర్తిస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం చేపడతానని, ముదిరాజ్ సామాజిక వర్గానికి అవసరమైన పంపు సెట్ల పంపిణీ వంటి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
తాను అధికార పార్టీలో ఉన్నందున నిధుల కొరత లేకుండా చూస్తానని, మీ ఇంట్లో పెద్ద కొడుకులా ఉండి ప్రతి సమస్యను తీరుస్తానని ఆయన ప్రజలకు విన్నవించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు, మరియు జిల్లా ఇంచార్జ్ తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో వార్డు అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీనివాస్ ప్రచారానికి వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత ఆయనకు బ్రహ్మరథం పడుతుండటంతో 24వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం హోరెత్తుతోంది. అభివృద్ధి చేసే వ్యక్తికే తమ ఓటు అని వార్డు వాసులు స్పష్టం చేస్తుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !