హుజురాబాద్‌లో బీజేపీ దూకుడు: 16వ వార్డులో బోడిగే రాధ ప్రచార హోరు.. కమలం గూటికి చేరిన బిఆర్ఎస్ శ్రేణులు..

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో బీజేపీ దూకుడు: 16వ వార్డులో బోడిగే రాధ ప్రచార హోరు.. కమలం గూటికి చేరిన బిఆర్ఎస్ శ్రేణులు..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఫిబ్రవరి 07:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ 16వ వార్డులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బోడిగే రాధ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆమె సాగిస్తున్న పాదయాత్రకు ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలుపుతుండటంతో 16వ వార్డులో బీజేపీ విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది.
బోడిగే రాధ గారి ప్రచార జోరుకు తోడు, అదే వార్డులో బిఆర్ఎస్ (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, అభ్యర్థి విజయానికి తోడ్పడతామని ప్రకటించి బీజేపీలో చేరారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో అజయ్ కేశవేణి, ఉస్మాన్ పాషా, టిప్పు సుల్తాన్, ప్రణయ్ శెట్టి, శ్రావణ్ వేమూరి, గోశిక ప్రభాకర్, మలుగురి నరేష్, నిఖిల్ గోశిక, ప్రశాంత్ ఆరవెల్లి, అరుణ గోశిక, సునీత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. అభ్యర్థి బోడిగే రాధ గారి గెలుపు కోసం కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే 16వ వార్డులో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !