హుజూరాబాద్ మున్సిపల్ బరిలో పోలీస్ అధికారి సోదరి రొంటాల సుహాసిని: 30వ వార్డు అభ్యర్థిగా ముమ్మర ప్రచారం.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్ మున్సిపల్ బరిలో పోలీస్ అధికారి సోదరి రొంటాల సుహాసిని: 30వ వార్డు అభ్యర్థిగా ముమ్మర ప్రచారం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 05: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హుజూరాబాద్‌లో రాజకీయ సందడి నెలకొంది. చైర్మన్ పీఠం దళిత మహిళకు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీలన్నీ బలమైన అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా రొంటాల సుహాసిని రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన సుహాసిని, ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేస్తున్న ఓ కీలక అధికారికి స్వయానా సోదరి. ఆమె కుటుంబంలోని పలువురు సభ్యులు ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందడం సుహాసినికి సానుకూలాంశంగా మారింది.
వార్డు పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. తొలుత 30వ వార్డు కౌన్సిలర్‌గా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె ప్రజలను కోరారు. కౌన్సిలర్‌గా విజయం సాధించిన అనంతరం చైర్మన్ పదవిని దక్కించుకుని మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, కేసరి మధుకర్ రావు, దిల్ శ్రీనివాస్, ఎర్ర కుమార స్వామి, రేణిగుంట్ల సందీప్, చిట్యాల రేవంత్, మొలుగూరి రాధా తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. విద్యావంతురాలైన సుహాసినిని గెలిపించుకుంటే వార్డు రూపురేఖలు మారుతాయని వారు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !