హుజురాబాద్‌లో కాంగ్రెస్ విజయభేరి.. 3వ వార్డులో ప్రణవ్ బాబు ప్రచార హోరు, అభ్యర్థి ప్రభాకర్‌కు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో కాంగ్రెస్ విజయభేరి.. 3వ వార్డులో ప్రణవ్ బాబు ప్రచార హోరు, అభ్యర్థి ప్రభాకర్‌కు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 01: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పురపాలక సంఘ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మూడవ వార్డులో తమ దూకుడును ప్రదర్శించాయి. ఆదివారం జరిగిన ముమ్మర ప్రచారంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పాల్గొని, పార్టీ అభ్యర్థి రావుల ప్రభాకర్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వార్డులో కాంగ్రెస్ శ్రేణులకు స్థానిక ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. మహిళలు హారతులు పట్టి, యువత భారీ కేకల మధ్య అభ్యర్థికి ఘనస్వాగతం పలికారు. ప్రణవ్ బాబు మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కేవలం ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సాకారం అయ్యాయని గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి గడపకు చేరుతున్నాయని, ఈ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్డు అభ్యర్థి రావుల ప్రభాకర్ ప్రతి గడపకూ వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక వసతుల కల్పనే తన తొలి ప్రాధాన్యత అని ఆయన ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రజలు తమపై చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వార్డులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాలంటే చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కీలక నేతలు, వార్డు ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు మరియు వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో 3వ వార్డు పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. అభివృద్ధికి పట్టం కడతామని, ఈసారి తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని ఓటర్లు ముక్తకంఠంతో హామీ ఇవ్వడం గమనార్హం.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !