మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చి ప్రభుత్వం ఆదుకోవాలి: హుజూరాబాద్ మేదరి మహేంద్ర సంఘం డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చి ప్రభుత్వం ఆదుకోవాలి: హుజూరాబాద్ మేదరి మహేంద్ర సంఘం డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 31: అనాదిగా అడవి తల్లులైన సమ్మక్క-సారక్క దేవతల సాక్షిగా వెదురుపై ఆధారపడి జీవిస్తున్న మేదరి కులస్తులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని హుజూరాబాద్ మేదరి మహేంద్ర సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో మేదరులు ఇప్పటికే ఎస్టీ (ST) కేటగిరీలో కొనసాగుతున్నారని, అదే విధంగా తెలంగాణలో కూడా తమను తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.
గత ఏడాది ఆగస్టు 7న ఆదిలాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేదరి కులస్తుల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని సంఘం ప్రతినిధులు గుర్తు చేశారు. అయితే, ఆ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ ఆచరణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా, క్షేత్రస్థాయిలో తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు.
వృత్తిపరంగా వెదురు పనిపై ఆధారపడిన మేదరులు ప్రస్తుతం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించి త్వరలోనే తమను ఎస్టీలుగా గుర్తించి, ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాలని హుజూరాబాద్ మేదరి మహేంద్ర
సంఘం నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !