హుజురాబాద్ 15వ వార్డు కౌన్సిలర్ బరిలో ఎరుకల సంఘం అభ్యర్థి కూతాడి కుమారస్వామి.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జనవరి 30 : మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా హుజురాబాద్ 15వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అనాదిగా అణచివేతకు, వివక్షకు గురవుతున్న ఎరుకల జాతి ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కూతాడి కుమారస్వామి 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ చరిత్రలో ఎరుకల సామాజిక వర్గం నుండి మొట్టమొదటిసారిగా ఒక అభ్యర్థి పోటీకి నిలవడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకినీ రాజు  మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా, ఇతర తెగలతో పోల్చుకుంటే ఎరుకల జాతి అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దాదాపు 8000 ఓట్ల బలం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశాయని విమర్శించారు. అర్హులైన తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా, ఒకే కుటుంబానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుండి చురుకైన పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు కూతాడి కుమారస్వామిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వార్డు ప్రజలపై ఉందని సంఘం నేతలు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం, ఎరుకల జాతి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న కుమారస్వామికి 15వ వార్డు ప్రజలు, ముఖ్యంగా ఎరుకల సామాజిక వర్గ బాంధవులు అండగా నిలవాలని వారు కోరారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, వార్డు అభివృద్ధి కోసం తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..