లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ).

bahubalamtv Reporter
bahubalamtv.in

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ).

బాహు బలంన్యూస్,మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా), ఆగస్టు 06 :పట్టా దార్ పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 5,000 లంచం డిమాండ్ చేసిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ) ఏసీబీ అధికారులకు చిక్కారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి మాథె రాజేష్ (37) బాధితుడి నుంచి రూ. 5,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు గురువారం (06-08-2026) ఆత్మకూర్ జి.పి.ఓ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతామని అధికారులు సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !