ఆల్ఫోర్స్ పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

bahubalamtv Reporter
bahubalamtv.in

ఆల్ఫోర్స్ పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 07: హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. పండుగకు ముందే పాఠశాల ఆవరణలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో సంక్రాంతికి విశిష్ట స్థానం ఉందని, రైతుల శ్రమకు గౌరవం దక్కే పవిత్రమైన పండుగ ఇదని కొనియాడారు. ప్రకృతితో మమేకమై కష్టపడే తత్వాన్ని, ఐక్యతను చాటిచెప్పే ఇలాంటి పండుగలను జరుపుకోవడం వల్ల విద్యార్థులలో మన సాంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. మన పూర్వీకులు అందించిన గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అనంతరం డాక్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి వరి నాట్లు వేసి వ్యవసాయంపై మక్కువను చాటారు. కిండర్ గార్డెన్ చిన్నారులపై భోగి పళ్లు పోసి ఆశీర్వదించగా, సంప్రదాయబద్ధంగా వేసిన భోగి మంటలతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, గ్రామీణ వృత్తుల విశిష్టతను తెలిపే వేషధారణలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !