హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా పంజాల రాజు ఏకగ్రీవ ఎన్నిక

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా పంజాల రాజు ఏకగ్రీవ ఎన్నిక

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జనవరి 07 :హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా బోత్తలపల్లి గ్రామ ఉపసర్పంచ్ శ్రీ పంజాల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉపసర్పంచుల ప్రత్యేక సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన పంజాల రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండలంలోని ఉపసర్పంచులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచుల హక్కుల కోసం, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉపసర్పంచులకు సముచిత గౌరవం దక్కేలా చూస్తానని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఫోరమ్ బలోపేతానికి పాటుపడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పంజాల రాజుకు మద్దతుగా నిలిచిన వారిలో చెల్పూర్ ఉపసర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, శాలాపల్లికి చెందిన అశోక్ కుమార్, జూపాక నుండి గిన్నారపు మహేందర్, వెంకట్రావుపల్లి నుండి అవుల సంపత్, పోతిరెడ్డిపేట ఉపసర్పంచ్ అజయ్, మందాడిపల్లికి చెందిన సుధాకర్, తుమ్మనపల్లి నుండి శ్రీకాంత్ రెడ్డి, సింగపూర్ ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి, కాట్రపల్లి నుండి బిక్షపతి, కనుకిలాగిద్దె నుండి బాలరాంరెడ్డి, రంగాపూర్ నుండి నరేష్ మరియు రాజపల్లి ఉపసర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పంజాల రాజును పలువురు నాయకులు, తోటి ఉపసర్పంచులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !