బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుకు శాపం: చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి – జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్.

bahubalamtv Reporter
bahubalamtv.in

బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుకు శాపం: చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి – జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, నవంబర్ 4: 18 ఏళ్ల వయస్సు నిండని బాలబాలికలకు జరిగే బాల్య వివాహాలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్ అన్నారు. హుజురాబాద్ మండలం, సింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుకునే బాలికలకు తెలిసి తెలియని వయసులో వివాహాలు చేయడం వల్ల వారు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఇది వారి లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకోవడమే కాక, అనేక అవకాశాలు కోల్పోయేలా చేస్తుందని తెలిపారు. బాల్య వివాహాల ప్రయత్నాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే, వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ - 1098 లేదా చైల్డ్ హెల్ప్ డెస్క్ - 9490881098 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాల్య వివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయని రమేష్ హెచ్చరించారు. పిల్లలకి పెద్దల మాదిరిగానే హక్కులు ఉన్నాయని, వారి హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత సమాజంలోని పెద్దలందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్మాస్టర్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు పుష్పలత, ఉమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, నవంబర్ 4: 18 ఏళ్ల వయస్సు నిండని బాలబాలికలకు జరిగే బాల్య వివాహాలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్ అన్నారు. హుజురాబాద్ మండలం, సింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుకునే బాలికలకు తెలిసి తెలియని వయసులో వివాహాలు చేయడం వల్ల వారు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఇది వారి లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకోవడమే కాక, అనేక అవకాశాలు కోల్పోయేలా చేస్తుందని తెలిపారు. బాల్య వివాహాల ప్రయత్నాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే, వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ – 1098 లేదా చైల్డ్ హెల్ప్ డెస్క్ – 9490881098 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాల్య వివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయని రమేష్ హెచ్చరించారు. పిల్లలకి పెద్దల మాదిరిగానే హక్కులు ఉన్నాయని, వారి హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత సమాజంలోని పెద్దలందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్మాస్టర్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు పుష్పలత, ఉమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !