ఘనంగా కమలాపూర్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంల

బాహు బలం న్యూస్ కమలాపూర్. నవంబర్ 09 :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమలాపూర్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు శనిగరపు రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్థానాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా
శనిగరపు రమేష్ మాట్లాడుతూ
జననేతగా రేవంత్ రెడ్డి: జడ్పీటీసీ స్థాయి నుండి 17 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రతిపక్షాల నుండి ఎదురైన ఎన్నో సవాళ్లు, దిక్కారాలను ఎదురించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జననేత రేవంత్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు.

విద్యపై ప్రత్యేక దృష్టి: పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు చదువు ద్వారానే మారుతాయని నమ్మి, పేదవారికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ బడుల దశ, దిశను మార్చేందుకు చర్యలు తీసుకోవడం ఆయన దూరదృష్టిని స్పష్టం చేస్తుందని తెలిపారు.

అక్రమార్కులపై ఉక్కుపాదం: ‘హైడ్రా’ ద్వారా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, కబ్జా అంటేనే భయపడేలా చేశారని ఆయన అన్నారు.

ఆరోగ్యశ్రీ పెంపు: పేదల కోసం ఆరోగ్యశ్రీ సేవలను ₹5 లక్షల నుండి ₹10 లక్షల రూపాయలకు పెంచి, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు.

మహిళా సాధికారత: మహిళా మణులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు.

దీర్ఘకాల పాలన: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అండతో మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా మీరే ఉంటారని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:

ఈ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ మండల నాయకులు తడక శ్రీకాంత్, మాట్ల రమేష్, డా. మౌట కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పోడేటి బిక్షపతి, బొల్లం రాజిరెడ్డి, పరుశరాములు, గూడెపు మొగిలియ్య, కనుకరత్నం, చేరిపల్లి రాంచందర్, దర్ముల శ్రీకాంత్, ఆడెపు శ్రీకాంత్, పైసా శరత్, చేరాల రోహిత్, గాలిబ్ నవీన్, మొగలిచర్ల శ్రీనివాస్, పుల్ల శోభన్, పుల్ల సుభాష్, రామస్వామి, నాగరాజు, పంగిడిపల్లి యుగేందర్, పాక చంద్రమౌళి, శనిగరపు రోహిత్, పుల్ల సునీల్, సారంగాపానీ, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !