విద్యా హక్కు చట్టం అమలు చేయాలి: పీడీఎస్‌యూ డిమాండ్

bahubalamtv Reporter
bahubalamtv.in

విద్యా హక్కు చట్టం అమలు చేయాలి: పీడీఎస్‌యూ డిమాండ్

బాహు బలం న్యూస్ కరీంనగర్ జూన్ 05:రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పీడీఎస్‌యూ (PDSU) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో మొండయ్యకు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం అమలును పర్యవేక్షించి, పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందేలా చూడాలని పీడీఎస్‌యూ విజ్ఞప్తి చేసింది.
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరించింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !