జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకి ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ తక్షణ చర్యలు: ఆర్థిక భారం తగ్గనున్న కుటుంబాలు

bahubalamtv Reporter
bahubalamtv.in

జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకి ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ తక్షణ చర్యలు: ఆర్థిక భారం తగ్గనున్న కుటుంబాలు

బాహు బలంన్యూస్ విజయవాడ జూన్ 05:జర్నలిస్టుల కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు సడలింపు కల్పించాలని ఐ అండ్ పీఆర్ డైరెక్టర్  హిమాంశు శుక్లా (ఐఏఎస్) తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ చొరవతో జర్నలిస్టుల కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
Secretariat Journalists Association ప్రతినిధులు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి, జర్నలిస్టుల పిల్లల ఫీజు సడలింపు కోసం విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ విజ్ఞప్తిపై డైరెక్టర్ శుక్లా వెంటనే స్పందించి, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను కోరారు.
దీనిపై జిల్లా కలెక్టర్లు సానుకూలంగా స్పందిస్తూ, "జర్నలిస్టులకు ఎప్పుడైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము" అని హామీ ఇచ్చారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సంబంధిత ఆదేశాలు జారీ చేయబడతాయని వారు డైరెక్టర్ హిమాంశు శుక్లాకు తెలిపారు.
ఫీజు రాయితీ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తమ జిల్లాల కలెక్టర్లను సంప్రదించి పరిష్కరించుకోవాలని డైరెక్టర్ హిమాంశు శుక్లా జర్నలిస్టులకు సూచించారు.
జర్నలిస్టుల పిల్లల విద్య కోసం తీసుకుంటున్న ఈ చొరవకు Secretariat Journalists Association ప్రెసిడెంట్ రాజా రమేష్, ఇతర ప్రతినిధులు, అలాగే ఇతర జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశంపై సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి కూడా సానుకూలంగా స్పందించడం అభినందనీయం అని వారు పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ విజయవాడ జూన్ 05:జర్నలిస్టుల కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు సడలింపు కల్పించాలని ఐ అండ్ పీఆర్ డైరెక్టర్  హిమాంశు శుక్లా (ఐఏఎస్) తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ చొరవతో జర్నలిస్టుల కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
Secretariat Journalists Association ప్రతినిధులు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి, జర్నలిస్టుల పిల్లల ఫీజు సడలింపు కోసం విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ విజ్ఞప్తిపై డైరెక్టర్ శుక్లా వెంటనే స్పందించి, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను కోరారు.
దీనిపై జిల్లా కలెక్టర్లు సానుకూలంగా స్పందిస్తూ, “జర్నలిస్టులకు ఎప్పుడైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము” అని హామీ ఇచ్చారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సంబంధిత ఆదేశాలు జారీ చేయబడతాయని వారు డైరెక్టర్ హిమాంశు శుక్లాకు తెలిపారు.
ఫీజు రాయితీ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తమ జిల్లాల కలెక్టర్లను సంప్రదించి పరిష్కరించుకోవాలని డైరెక్టర్ హిమాంశు శుక్లా జర్నలిస్టులకు సూచించారు.
జర్నలిస్టుల పిల్లల విద్య కోసం తీసుకుంటున్న ఈ చొరవకు Secretariat Journalists Association ప్రెసిడెంట్ రాజా రమేష్, ఇతర ప్రతినిధులు, అలాగే ఇతర జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశంపై సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి కూడా సానుకూలంగా స్పందించడం అభినందనీయం అని వారు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !